బెల్లంకొండ బాబు కందిరీగ సీక్వెల్ కాదు కదా  

Bellamkonda Srinivas Movie Look Like Kandireega Sequel - Telugu Bellamkonda Srinivas Movie, Director Santosh Srinivas, Kandireega Sequel, Tollywood

అల్లుడు శీను సినిమాతో వివి వినాయక్ లాంటి మాస్ కమర్షియల్ దర్శకుడు చేతుల మీదుగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా లాంచ్ అయ్యాడు.అయితే ఆ సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న కమర్షియల్ హీరో అనిపించుకోవాలనే తన ప్రయత్నాలకి దెబ్బ తగులుతూనే వచ్చింది.

Bellamkonda Srinivas Movie Look Like Kandireega Sequel

అతను చేసిన సినిమాల కంటెంట్ బాగున్న అవన్నీ బెల్లంకొండ శ్రీనివాస్ మార్కెట్ కి మించి ఉండటంతో పాటు, అనవసరమైన హీరో ఎలివేషన్ కోసం కథని కిల్ చేయడం వలన అతని సినిమాలు అన్ని ఫ్లాప్ అవుతూ వచ్చాయి.అలాంటి టైంలో తనని తాను కొద్దిగా తగ్గించుకొని చేసిన సినిమా రాక్షసుడు అతని కెరియర్ కి ఫస్ట్ హిట్ ఇచ్చింది.

ఇదే ఊపులో మరో హిట్ నిఖాతాలో వేసుకొని ఓ వైపు కమర్షియల్ హీరోగా, మరో వైపు ఎంటర్టైన్మెంట్ చిత్రాలకి చోయిస్ హీరోగా మారిపోవాలని భావించిన బెల్లంకొండ బాబు సంతోష్ శ్రీనివాస్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు.కందిరీగ సినిమాతో దర్శకుడుగా టర్న్ తీసుకున్న కెమెరామెన్ సంతోష్ శ్రీనివాస్ ఆ సినిమాని ఫుల్ లెంట్ కామెడీతో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఆవిష్కరించారు.

ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో కూడా ఆ తరహా సినిమానే ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.ఓ విధంగా చెప్పాలంటే కందిరీగ సినిమాకి సీక్వెల్ గా ఇది ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

హీరో క్యారెక్టర్ కందిరీగలో రామ్ తరహాలోనే ఏనర్జిటింగ్ గా ఉంటూ నవ్వులు పూయిస్తుందని తెలుస్తుంది.అలాగే ఇందులో కూడా కందిరీగ తరహాలోనే ఇద్దరు హీరోయిన్స్ గా నభా నటేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ ఉన్నారు.

విలన్ గా సోనోసూద్ ని రిపీట్ చేశారు.దీంతో ఈ సినిమా కందిరీగకి సీక్వెల్ అనే టాక్ బలంగా వినిపిస్తుంది.

తాజా వార్తలు