తన సినిమాలతో హిందీ డిజిటల్ లో ట్రెండ్ సృష్టిస్తున్న బెల్లంకొండ హీరో  

bellamkonda Srinivas movies trending in Hindi dubbing, Tollywood, Bollywood, South cinema, commercial formula, social media - Telugu Bellamkonda Srinivas Movies Trending In Hindi Dubbing, Bollywood, Commercial Formula, Social Media, South Cinema, Tollywood

టాలీవుడ్ లో బడా నిర్మాతగా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బెల్లంకొండ సురేష్ తనయుడుగా అల్లుడు శీను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటుడు బెల్లంకొండ శ్రీనివాస్. మొదటి సినిమాతోనే కమర్షియల్ హీరోగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ తర్వాత కూడా ఎక్కువ కమర్షియల్ ఫార్ములాలోనే సినిమాలు చేస్తూ వచ్చాడు.

 Bellamkonda Srinivas Kavacham Hindi Dubbed Youtube

తన సినిమాలో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోకపోయినా కూడా భారీ బడ్జెట్ తో తండ్రి సహకారంతో సినిమాలు చేస్తున్నాడు.కమర్షియల్ హీరోగా నిలబడేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

అతనికి రాక్షసుడు సినిమాతో కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ లభించింది.ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుడు అదుర్స్ సినిమా చేస్తున్నాడు.

తన సినిమాలతో హిందీ డిజిటల్ లో ట్రెండ్ సృష్టిస్తున్న బెల్లంకొండ హీరో-Movie-Telugu Tollywood Photo Image

ఇది కూడా తన గత చిత్రాల మాదిరిగానే పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కుతుంది.

ఇదిలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ గత సినిమాలన్నీ కూడా చాలా వరకు డిజాస్టర్, యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.

అతని సినిమాలకు పెట్టే బడ్జెట్ అతను మార్కెట్ కు మించి ఉండడంతో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా లాభాలు తెచ్చుకోలేదు.అయితే కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలో కావడంతో కొంత వరకు పర్వాలేదు అని చెప్పాలి.

సౌత్ లో వచ్చే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ కథలకు హిందీలో మంచి మార్కెట్ ఉంటుంది.నార్త్ ఇండియాకు చెందిన కొన్ని రాష్ట్రాల్లో మన మాస్ సినిమాలు విపరీతంగా ఇష్టపడుతుంటారు.

దీంతో కొంతమంది నిర్మాతలు మన తెలుగు సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తుంటారు.అలా సౌత్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు హిందీలో మంచి డిమాండ్ ఉంది.

ఆ తర్వాత ఎక్కువగా హిందీ డబ్బింగ్ రూపంలో మార్కెట్ ఉన్న సినిమాలు బెల్లంకొండ శ్రీనివాస్ వి కావడం విశేషం.యూట్యూబ్ లో అతని హిందీ డబ్బింగ్ సినిమాలు రికార్డు స్థాయిలో సక్సెస్ సొంతం చేసుకుంటాయి.

ఈ మధ్యకాలంలో బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా కవచం అనే సినిమా చేశాడు.అయితే ఈ సినిమా తెలుగులో ఎప్పుడు రిలీజ్ అయింది అనే విషయం కూడా చాలామందికి తెలియదు.

దీనిని హిందీలో ఇన్స్పెక్టర్ విజయ్ గా డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో ఉన్నారు.ఇక ఈ సినిమా ఏకంగా 200 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడం గమనార్హం.

ఓ విధంగా చెప్పాలంటే ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ అయిందని చెప్పాలి.ఈ యూట్యూబ్ లో వచ్చే వ్యూస్ చూసుకొని బెల్లంకొండ శ్రీనివాస్ తన సినిమాలకు హిందీలో మార్కెట్ విపరీతంగా ఉందని భావిస్తున్నారు.

దీంతో ఈసారి తను కూడా పాన్ ఇండియన్ సినిమా ప్లాన్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం.

#Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bellamkonda Srinivas Kavacham Hindi Dubbed Youtube Related Telugu News,Photos/Pics,Images..