మారుతి కథ నచ్చింది కానీ డేట్స్ కష్టం అంటున్న బెల్లంకొండ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కమర్షియల్ సినిమాలతో మాస్ హీరగా తనని తాను ప్రోజక్ట్ చేసుకొని వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.కెరియర్ లో ఫ్లాప్ లు పడ్డా కూడా ఇతని సినిమాలు మాత్రం ఆగడం లేదు.

 Bellamkonda Srinivas Interested On Director Maruthi Story, Tollywood, Telugu Cin-TeluguStop.com

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుడు అదుర్స్ మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ త్వరలో సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నారు.ఇందులో నాభా నటేష్ హీరోయిన్ గా చేస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ఓ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యాడని తెలుస్తుంది.ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో అతనికి ఛాన్స్ ఇచ్చినట్లు టాక్.

ఈ సినిమాలో మరో కుర్ర హీరో కూడా ఉంటాడు.

ఇదిలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ కి రీసెంట్ గా సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతి ఓ కథ చెప్పడం జరిగిందని సమాచారం.

ఇక ఆ కథ కూడా శ్రీనివాస్ కి బాగా నచ్చిందని, హీలేరియస్ కామెడీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ కథ ఉండబోతుందని తెలుస్తుంది.అయితే ఈ సినిమా కోసం మారుతి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య డేట్స్ కావాలని అడిగాడని, అయితే ఆ సమయంలో అల్లుడు అదుర్స్ పూర్తి చేయడంతో పాటు వేరొక సినిమాకి కూడా కమిట్ అయ్యి ఉండటంతో అప్పుడైతే చేయడం కష్టం అని చెప్పినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

వెయిట్ చేస్తే వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకొని వెళ్దామని మారుతికి బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పాడని, అయితే దీనిపై మారుతి నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే మారుతి రవితేజకి కూడా ఒక కథ చెప్పి ఒప్పించాడు.

ఈ సినిమాని వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని అనుకుంటున్నాడు.ఈ నేపధ్యంలో బెల్లంకొండ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టె అవకాశం ఉందని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube