అల్లుడు అదుర్స్ దెబ్బకు బెల్లంకొండ బాబు టాలీవుడ్‌ను పక్కనబెట్టాడా?- Bellamkonda Sreenivas Focusing Only On Bollywood Entry

Bellamkonda Sreenivas Focusing Only On Bollywood Entry, Bellamkonda, Sreenivas, Alludu Adhurs, Nabha Natesh, Santhosh Srinivas, Tollywood News - Telugu Alludu Adhurs, Bellamkonda, Nabha Natesh, Santhosh Srinivas, Sreenivas, Tollywood News

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అల్లుడు అదుర్స్’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసి అదిరిపోయే హిట్ అందుకునేందుకు బెల్లంకొండ బాబు ప్లాన్ చేశాడు.

 Bellamkonda Sreenivas Focusing Only On Bollywood Entry-TeluguStop.com

ఇక ఈ సినిమాను కందిరీగ ఫేం దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.అయితే సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమాకు తొలి రోజు మిక్సిడ్ టాక్ రావడం, ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు పెద్దగా ఆసక్తిని చూపకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్ దిశగా వెళ్తుంది.

కాగా ఈ సినిమాపై భారీ నమ్మకం పెట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సినిమా రిజల్ట్‌తో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా రిజల్ట్‌ను పట్టించుకోకుండా తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు ఈ హీరో.

 Bellamkonda Sreenivas Focusing Only On Bollywood Entry-అల్లుడు అదుర్స్ దెబ్బకు బెల్లంకొండ బాబు టాలీవుడ్‌ను పక్కనబెట్టాడా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ప్రభాస్ నటించిన ఛత్రపతి చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ సినిమాను మాస్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతుండగా, ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించనున్నాడు.

దీంతో ఈ సినిమాపై అప్పుడే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అల్లుడు అదుర్స్ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకుందామని చూసినా, అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీపైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు ఈ హీరో.

ఇక బాలీవుడ్‌లో ఛత్రపతి చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు చిత్ర యూనిట్.ఈ సినిమాను ఫిబ్రవరి రెండో వారంలో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతుంది.

మరి ఈ సినిమాతో బెల్లంకొండ బాబు బాలీవుడ్‌లో ఎలాంటి ఎంట్రీ ఇస్తాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక అల్లుడు అదుర్స్ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అందాల భామ నభా నటేష్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

#Nabha Natesh #Alludu Adhurs #Sreenivas #Bellamkonda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు