బెల్లంకొండలో ఇన్ని వేరియేషన్స్‌ ఏంట్రా బాబోయ్‌  

bellamkonda sai srinivas mass look goes viral , bellamkonda sai srinivas ,alludu adhurs, bellamkonda sai srinivas new look, prakash raj, sonusood, bellamkonda mass look - Telugu @bsaisreenivas, Alludu Adhurs, Bellamkonda Mass Look, Bellamkonda Sai Srinivas, Bellamkonda Sai Srinivas Mass Look Goes Viral, Bellamkonda Sai Srinivas New Look, Prakash Raj, Sonusood

అల్లుడు శీనుతో హీరోగా పరిచయం అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ప్రస్తుతం అల్లుడు అదుర్స్‌ సినిమాను చేస్తున్నాడు.సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ పునః ప్రారంభం అయ్యింది.

TeluguStop.com - Bellamkonda Sai Srinivas Mass Look Goes Viral

కరోనా కారణంగా ఆరు నెలల పాటు నిలిచి పోయిన సినిమాను ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు.ఈ సమయంలోనే బెల్లంకొండ శ్రీనివాస్‌ వరుసగా తన ఫొటో షూట్‌ స్టిల్స్‌ ను విడుదల చేస్తూ వస్తున్నాడు.

ఇటీవల క్లీన్‌ షేవ్‌ తోవావ్‌ అనిపించిన బెల్లంకొండ కొన్ని రోజుల్లోనే గడ్డం మరియు జుట్టు ఒత్తుగా మాస్‌ లుక్‌ తో మరికొన్ని ఫొటోలను విడుదల చేశాడు.తాజాగా వరుసగా మీసాలతో వింటేజ్‌ లుక్‌ ను షేర్‌ చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మరోసారి ఆకట్టుకునే లుక్‌ ను షేర్‌ చేశాడు.

TeluguStop.com - బెల్లంకొండలో ఇన్ని వేరియేషన్స్‌ ఏంట్రా బాబోయ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మాస్ ఆడియన్స్‌ కు బాగా కనెక్ట్‌ అయ్యే మంచి పోస్టర్‌ను బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ షేర్‌ చేశాడు.మీస కట్టుతో పాటు ఆకట్టుకునే కాస్ట్యూమ్స్‌ తో బెల్లంకొండ బాబు వావ్‌ అనిపించాడు.

మాస్‌ ఆడియన్స్‌ కు బాగా కనెక్ట్‌ అయ్యేలా దర్శకుడు ఈయనలోని మాస్‌ యాంగిల్స్‌ ను బయటకు తీసుకు వచ్చేలా కథలు ఎంపిక చేయాలని ఈ ఫొటోలు చూసిన అభిమానులు అంటున్నారు.బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ లవర్‌ బాయ్‌ గా మరియు మాస్‌ హీరోగా కూడా రాణించగలడు అంటూ అంతా నమ్మకంగా చెబుతున్నారు.

మొత్తానికి ఇన్‌ స్టా గ్రామ్‌లో ఇతడు షేర్‌ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు ఇతడి క్రేజ్‌ను మరింతగా పెంచుతున్నాయి.అల్లుడు అదుర్స్‌ సినిమాలో నభా నటేష్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది.

సోనూసూద్‌ మరియు ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అంటూ సమాచారం అందుతోంది.

#BellamkondaSai #@BSaiSreenivas #BellamkondaSai #BellamkondaMass #Alludu Adhurs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bellamkonda Sai Srinivas Mass Look Goes Viral Related Telugu News,Photos/Pics,Images..