బెల్లంకొండ బాలీవుడ్‌ మూవీ అధికారిక ప్రకటన

గత కొన్ని రోజులుగా తెలుగు సూపర్‌ హిట్‌ మూవీ చత్రపతి సినిమాను హిందీలో బెల్లంకొండ హీరోగా వివి వినాయక్‌ దర్శకత్వంలో రీమేక్‌ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.కాని చాలా మంది ఈ సినిమా వార్త కేవలం పుకారే అనుకున్నారు.

 Bellamkonda Sai Srinivas Chatrapathy Movie Remake Official News, Bellam Konda Sr-TeluguStop.com

చత్రపతి వంటి భారీ సినిమాను అక్కడ బెల్లంకొండ వంటి చిన్న హీరో ఎలా రీమేక్‌ చేస్తాడు అది కూడా అక్కడ బెల్లంకొండ కొత్త హీరో అంటూ లాజిక్కలు మాట్లాడారు.కాని మేము చెప్పినట్లుగానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ బాలీవుడ్‌ మూవీ కన్ఫర్మ్‌ అయ్యింది.

అధికారికంగా ప్రకటన వచ్చింది.బెల్లంకొండ హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.

అందరిని ఆశ్చర్యపర్చుతూ సినిమా అధికారిక ప్రకటన రావడంతో ఇన్ని రోజుల వార్తలకు ఒక క్లారిటీ వచ్చింది.

Telugu @bsaisreenivas, @directorvinayak, Bellamkonda, Bellamkondasai, Chatrapath

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ను హీరోగా వివి వినాయక్‌ పరిచయం చేశాడు.అల్లుడు శీను సినిమాతో బెల్లంకొండ తెలుగు ప్రేక్షకులు పరిచయం అయ్యాడు.కనుక ఇప్పుడు బాలీవుడ్‌లో మరోసారి ఈ యంగ్‌ హీరో పరిచయం కాబోతున్నాడు.

వినాయక్‌ ఈ రీమేక్‌ కు సరైన ఎంపిక అవునా కాదా అనే చర్చ ప్రస్తుతం చర్చ జరుగుతోంది.వినాయక్‌ విషయంలో ఈమద్య కాస్త నెగటివిటీ ఉంది.ఇక ఈయన హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమాను తీస్తాడా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.రీమేక్‌ లు చేసి సక్సెస్‌లు దక్కించుకున్న ఘనత వినాయక్‌ కు ఉంది.

కాని ఆయన ఈ రీమేక్‌ ను హిందీలో తీయాల్సి ఉంది.కనుక చాలా అనుమానం వ్యక్తం అవుతుంది.

వినాయక్‌ ఈ బాధ్యతను ఎంత వరకు సక్సెస్‌ గా మోస్తాడు అనేది చూడాలి.వచ్చే ఏడాది ప్రారంభం కాబోతున్న ఈ రీమేక్‌ మూవీ 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube