ట్రైలర్‌ టాక్‌ః అదే అల్లుడు, ఈసారి కాస్త స్టైల్‌ మార్చాడు అంతే

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా నభా నటేష్‌ హీరోయిన్‌ గా సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ అల్లుడు అదుర్స్‌.ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.

 Bellamkonda Sai Srinivas Alludu Adurs Movie Trailer Talk , Santosh Srinivas, Nab-TeluguStop.com

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.రికార్డు స్థాయిలో ఈ సినిమాకు ఖర్చు చేసినట్లుగా ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.

ఇదో మాస్ ఎంటర్‌ టైనర్‌ గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా ఇప్పటి వరకు టాక్ వినిపించింది.ఇప్పుడు ట్రైలర్‌ చూస్తే సినిమా ఖచ్చితంగా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతూ ఉండగా ట్రైలర్‌ ను విడుదల చేయడం జరిగింది.

ట్రైలర్‌ ను చూస్తుంటే అల్లుడు శ్రీను సినిమాలో సాయి శ్రీనివాస్‌ ను చూసినట్లే ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.అల్లుడు శ్రీను సినిమా సమయంలో ఎలా అయితే ఉన్నాడో అలాగే ఉండటంతో పాటు నటన విషయంలో కూడా ఎలాంటి మార్పు లేదు అనిపిస్తుంది.హీరోయిన్స్‌ ను వెంట బెట్టుకుని ఎంటర్‌ టైన్‌ చేసేందుకు మరోసారి ప్రయత్నించబోతున్న సాయి శ్రీనివాస్ కు ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది ఆసక్తికరంగా ఉంది.

అల్లుడు అదుర్స్ సినిమా లో సోనూ సూద్‌ తో పాటు ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలో కనిపించడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఇక ఈ సినిమాలో అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌ గా నటించగా బిగ్‌ బాస్‌ ముద్దుగుమ్మ మోనాల్‌ గజ్జర్‌ ఐటెం సాంగ్ ను చేసిన విషయం తెల్సిందే.

సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి.ఆ పోటీలో అల్లుడు ఎంత వరకు నిలదొక్కుకుంటాడు అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube