బెల్లంకొండ బాబు పక్కన రొమాన్స్ చేయనున్న చైల్డ్ ఆర్టిస్ట్  

Bellamkonda Romance With Chaitu\'s Daughter-bellamkonda

బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ చిత్రంతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం విదితమే.అయితే బెల్లంకొండ తమ్ముడు అయిన బెల్లంకొండ గణేష్ బాబు ను కూడా టాలీవుడ్ కు పరిచయం చేయాలనీ గత కొంత కాలంగా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది.ఈ క్రమంలో ఇటీవల గణేష్ బాబు హీరో గా తెరకెక్కనున్న సినిమా లాంఛనంగా ప్రారంభమైంది కూడా.

Bellamkonda Romance With Chaitu\'s Daughter-bellamkonda-Bellamkonda Romance With Chaitu's Daughter-Bellamkonda

అయితే ఈ చిత్రంలో బాబు కు జోడీ గా ఎవరిని ఎన్నుకోవాలి అన్న దానిపై ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది.బెల్లంకొండ తన తోలి చిత్రంలో అప్పటికే టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిన సమంత ను హీరోయిన్ గా ఎన్నుకున్న విషయం తెలిసిందే.

Bellamkonda Romance With Chaitu\'s Daughter-bellamkonda-Bellamkonda Romance With Chaitu's Daughter-Bellamkonda

అయితే బాబు పక్కన కూడా అలానే ఇప్పటికే ఇండస్ట్రీ లు మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ ని ఎన్నుకుంటారేమో అని భావించగా ఇప్పుడు హీరో నాగచైతన్య కుమార్తెను గణేష్ పక్కన హీరోయిన్ గా ఎన్నుకున్నట్లు తెలుస్తుంది.కన్ఫ్యూజన్ గా ఉందా చైతు కుమార్తె ఏంటి అని అదే నాగచైతన్య,సమంత లు పెళ్లి తరువాత తొలిసారిగా కలిసి నటించిన చిత్రం ‘మజిలీ’.ఈ చిత్రంలో నాగచైతన్య పెంపుడు కుమార్తె గా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అనన్య అగర్వాల్.బాలీవుడ్ సీరియల్స్ తో మంచి ఫెమస్ అయిన ఈమె వయసు 15 సంవత్సరాలే అయినప్పటికీ గణేష్ బాబు పక్కన జోడిగా సరిపోతుంది అని అనన్య ను ఎన్నుకున్నట్లు తెలుస్తుంది.దానికి తోడు కధ కూడా టీనేజ్ లవ్ స్టోరీ కావడం తో అనన్య సరిగ్గా ఈ చిత్రానికి సరిపోతుంది అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ఈ విషయంపై చిత్రయూనిట్‌ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.అనన్య అగర్వాల్‌తో పాటు మరో నలుగురు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో నటిస్తున్నారు.ఇప్పటికే అనన్య, దక్ష, నటాషాలను హీరోయిన్లుగా తీసుకున్న చిత్రయూనిట్ మరో ఇద్దరు భామలు ఫైనల్‌ చేయాల్సి ఉందని తెలుస్తోంది.

ఈ సినిమాకు ప్రేమ ఇష్క్‌ కాదల్, సావిత్రి చిత్రాల దర్శకుడు పవన్‌ సాధినేని దర్శకత్వం వహిస్తున్నాడు.బీటెల్‌ లీఫ్ ప్రొడక్షన్స్‌, లక్కీ మీడియాలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విభిన్న చిత్రాల దర్శకుడు వివేక్‌ ఆత్రేయ స్క్రీన్‌ప్లే ,సంభాషణలు అందిస్తుండటం గమనార్హం.

మొత్తానికి మంచి అంచనాలను అందుకుంటున్న ఈ చిత్రం త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.