‘కవచం’ తర్వాత సీత.. కాజల్‌ ను వదలని బెల్లంకొండ   Bellamkonda Next Movie With Kajal Agarwal     2018-12-07   13:14:25  IST  Ramesh P

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ కెరీర్‌ కతం అయినట్లే అంటూ అంతా భావిస్తున్న సమయంలో మళ్లీ పుంజుకుంటూ ఉంది. ఆమద్య ఈమెకు ఆఫర్లు రావడం అనుమానమే అనుకున్నారు. కాని మళ్లీ వరుసగా చిత్రాల్లో నటిస్తోంది. నేడు కాజల్‌ హీరోయిన్‌గా నటించిన ‘కవచం’ మూవీ విడుదల అయిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంతో కాజల్‌ మరోసారి తన స్థాయిని చూపించబోతుంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్‌తో మరో మూవీని కూడా ఈమె చేసేందుకు సిద్దం అయ్యింది.

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా రూపొందబోతున్న ‘సీత’ అనే మూవీలో ఈమె నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో తేజ నే కాజల్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆ కారణంగానే మరోసారి తేజ దర్శకత్వంలో కాజల్‌ నటించేందుకు ఓకే చెప్పింది. హీరోయిన్‌ పాత్ర చుట్టు కథ నడుస్తుందని, అందుకే కాజల్‌ను ఈ చిత్రంలో తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Bellamkonda Next Movie With Kajal Agarwal-Bellamkonda Agarwal

తేజ గత చిత్రం నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో కూడా కాజల్‌ నటించి మెప్పించింది. మరోసారి కాజల్‌కు అవకాశం దక్కింది. ఇండియన్‌ 2 చిత్రంలో కూడా కాజల్‌ హీరోయిన్‌గా కమల్‌తో నటించబోతుంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.