బెల్లంకొండకు ఇంత సీన్‌ ఉందా..ప్రచార ఆర్బాటమా..   Bellamkonda Movie Going To Get Big Amount Of Budget     2018-07-11   03:19:13  IST  Raghu V

‘అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్‌ వరుసగా భారీ చిత్రాలను చేస్తున్నాడు. ఈయన చేసిన ఒక్క సినిమా మినహా మిగిలిన అన్ని చిత్రాలు కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కి మంచి వసూళ్లను సాధించినవే అని చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున ‘జయ జానకి నాయక’ చిత్రం విడుదలై భారీ వసూళ్లను సాధించిన విషయం తెల్సిందే. బెల్లంకొండ శ్రీనివాస్‌ తాజాగా చేసిన చిత్రం ‘సాక్ష్యం’. శ్రీవాస్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ మరియు ట్రైలర్‌లు విడుదలై సినిమాపై అంచనాలు పెంచేసింది.

సినిమాపై ప్రేక్షకుల్లో ఎంత అంచనాలు పెరిగినా, సినిమాలో ఉన్న హీరోను బట్టి మార్కెట్‌ జరుగుతుందనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. భారీ ఎత్తున వసూళ్లు చేయగ హీరో మూవీలకే మంచి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అవుతుంది. అడపా దడపా సక్సెస్‌లు దక్కించుకునే హీరోలు మాత్రం 25 కోట్ల లోపు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ను సాధిస్తూ ఉన్నారు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్‌ సాక్ష్యం చిత్రం మాత్రం ఏకంగా 40 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసిందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో నిజం ఎంతుందంటూ ప్రస్తుతం సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినప్పటికి హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కు అంత క్రేజ్‌ లేదు, ఇక దర్శకుడు శ్రీవాస్‌ కూడా పెద్దగా క్రేజ్‌ కలిగి లేడు. ఈయన గత చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. దాంతో ఈ చిత్రంను కొనుగోలు చేసేందుకు కూడా డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రారేమో అని కొందరు భావించారు. కాని అనూహ్యంగా 40 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ అంటే మామూలు విషయం కాదు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నైజాం ఏరియాలో ఏకంగా 7.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లుగా చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. స్టార్‌ హీరోల సినిమాల రేంజ్‌లో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు దిల్‌రాజు ఏమీ తెలివి లేనివాడు కాదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

7.5 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే నైజాం ఏరియాలో 10 కోట్ల షేర్‌ దక్కించుకోవాల్సి ఉంటుంది. అంత షేర్‌ బెల్లంకొండ శ్రీనివాస్‌కు సాధ్యం కాదని అందరికి తెలుసు. కాని చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం 40 కోట్లు బిజినెస్‌ అయ్యిందని చెప్పి చిత్రంపై అంచనాలు పెంచుతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇంత బిజినెస్‌ అసాధ్యం అని, ఇందతా కేవలం పబ్లిసిటీ కోసమే అంటున్నారు. బెల్లంకొండ థియేట్రికల్‌ రైట్స్‌ అంత భారీ మొత్తంలో బిజినెస్‌ అయితే స్టార్‌ అయినట్లే. ఎన్నో ఎళ్లుగా సినిమా ఇండస్ట్రీలో పడి ఉంటున్న హీరోలకు సాధ్యం కానిది ఈయనకు అప్పుడే సాధ్యం అయ్యేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ‘సాక్ష్యం’ గురించి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉంది.