వాచ్ లో టైమ్ ఎలా చూడాలో చెప్పి 20 డాలర్లు తీసుకున్న తారక్.. ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్ అనే విషయం తెలిసిందే.అందరితో సరదాగా ఉండే తారక్ ఛాన్స్ దొరికితే ఇతరులను ఆట పట్టిస్తూ ఉంటారు.

 Bellamkonda Ganesh Shocking Comments About Junior Ntr Goes Viral Details, Aadi M-TeluguStop.com

స్వాతిముత్యం హీరో బెల్లంకొండ గణేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తారక్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.నాకు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉందని నేను చిన్నప్పటి నుంచి సెట్ లోనే పెరిగానని ఫీలవుతానని గణేష్ అన్నారు.

నాకు 6 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో ఆది సినిమా షూటింగ్ జరిగిందని గణేష్ చెప్పుకొచ్చారు.అప్పటినుంచి సెలవులు ఉండి షూటింగ్ జరుగుతుంటే షూట్ జరుగుతున్న ప్లేస్ కు వెళ్లిపోయేవాడినని గణేష్ కామెంట్లు చేశారు.సెట్ వాతావరణాన్ని నేను చాలా ఇష్టపడతానని గణేష్ పేర్కొన్నారు.బయటినుంచి షూటింగ్ సెట్ ను చూస్తే ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాదని గణేష్ కామెంట్లు చేశారు.

 Bellamkonda Ganesh Shocking Comments About Junior Ntr Goes Viral Details, Aadi M-TeluguStop.com

మానిటర్ దగ్గరికి వెళ్లి చూడగానే ఒక చిన్న షాట్ కోసం 200 మంది పని చేయడం నాకు ఆసక్తిని పెంచిందని గణేష్ అన్నారు.

సెట్ లో ఏదో ఒక పని చేయాలని అనుకున్నానని యాక్టర్ గా ఛాన్స్ రావడంతో యాక్టింగ్ చేస్తున్నానని గణేష్ చెప్పుకొచ్చారు.తెలుగు ఆడియన్స్ రిజెక్ట్ చేసినా ఇండస్ట్రీలోనే ఏదో ఒక విధంగా ఉంటానని గణేష్ అన్నారు.నాకు మొదట వాచ్ లో టైమ్ చూసుకోవడం నేర్పించింది జూనియర్ ఎన్టీఆర్ గారు అని గణేష్ తెలిపారు.

ఆది షూటింగ్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లగా వాచ్ లో టైమ్ ఎలా చూడాలో చెప్పినందుకు నా దగ్గర నుంచి 10 డాలర్లు, అన్నయ్యకు టైమ్ ఎలా చూడాలో నేర్పించి అన్నయ్య దగ్గర 10 డాలర్లు మొత్తం 20 డాలర్లు తారక్ తీసుకున్నారని గణేష్ చెప్పుకొచ్చారు.ఆ సినిమా ఎక్స్ పీరియన్స్ ఫన్ ఎక్స్ పీరియన్స్ అని గణేష్ వెల్లడించారు.

Video : Bellamkonda Ganesh Shocking Comments About Junior Ntr Goes Viral Details, Aadi Movie, Bellamkona Ganesh, Junior Ntr, Swatimuthyam Movie, Tollywood, Adi Movie Shooting, Bellamkonda Ganesh Ntr #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube