బెల్లంకొండ స్వాతిముత్యం ఇలా చేశాడేంటి భయ్యా..!

బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా ఇప్పటికే పలు సినిమా ల్లో హీరోగా నటించి మెప్పించాడు.కమర్షియల్‌ గా భారీ హిట్స్ ను అందుకోవడం లో విఫలం అయినా కూడా హీరో గా గుర్తింపును దక్కించుకోవడం లో సఫలం అయ్యాడు అని చెప్పాలి.

 Bellamkonda Ganesh Movie Swathi Muthyam Release Postpone  , Swathi Muthyam, Bell-TeluguStop.com

ఇప్పుడు బెల్లంకొండ సురేష్ చిన్నబ్బాయి బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు.కరోనా వల్ల ఆలస్యం అయ్యింది కాని ఇప్పటికే ఈయన వెండి తెరపై సందడి చేయాల్సి ఉంది.

హీరోగా బెల్లంకొండ గణేష్‌ బాబు నటిస్తున్న మొదటి సినిమా స్వాతిముత్యం విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ ఆగస్టు 13న సినిమా ను విడుదల చేయాలని భావించినా కూడా కొన్ని కారణాల వల్ల సాధ్యం అవ్వడం లేదు అంటూ యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని కూడా చెప్పుకొచ్చారు.ఆగస్టు నెల మొత్తం వరుసగా పెద్ద సినిమా లు ఉన్న కారణంగా స్వాతిముత్యం ను వాయిదా వేయడం జరిగిందని అంటున్నారు.

బెల్లంకొండ బాబు చూడ్డానికి క్యూట్ గా ఉన్నాడు.టైటిల్‌ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

హీరోయిన్ గా నటించిన వర్ష బొల్లమ్మ కూడా ఇంట్రెస్ట్‌ గా ఉంది.సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తూ ఉంటే విడుదల వాయిదా వేశారేంటి సర్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సినిమా కు మంచి సమయం చూసి రిలీజ్ ను ప్లాన్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.స్వాతి ముత్యం సినిమా కు లక్ష్మణ్‌ కే కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా… భీమ్లా నాయక్ వంటి భారీ చిత్రాలను చాలా నిర్మించిన సితార ఎంటర్‌ టైన్మెంట్స్ వారు నిర్మించడం వల్ల సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

సినిమా హిట్‌ అయితే అన్నయ్య తో పాటు తమ్ముడు కూడా తెలుగు లో పాపులారిటీని సొంతం చేసుకుంటాడేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube