ఆగిపోయిన తెరి, కొత్త కథతో రానున్న బెల్లంకొండ

టాలీవుడ్ లో వారసత్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.సీనియర్ హీరో లు, దర్శకులు,నిర్మాతల కుమారులు వారసత్వం పేరుతొ ఇండస్ట్రీ లో అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

 Bellamkonda Coming With A Latest Story Theri Remake-TeluguStop.com

అయితే అలాంటి వారసత్వం తో వచ్చి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు అయిన శ్రీనివాస్ అల్లుడు శీను చిత్రం తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

అయితే ఈ చిత్రం చెప్పుకోదగ్గ విజయం సాధించకపోయినప్పటికీ ఈ గురుడుకు మాత్రం మూవీ లు బాగానే అందుకున్నాడు.అయితే తన సినీ కెరీర్ లో ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో ఒకటో రెండో హిట్ లు కొట్టడం తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సిద్దమౌతున్నాడు.

అయితే తమిళంలో మంచి హిట్ సాధించిన తెరి చిత్రం రీమేక్ చేయాలనీ భావించగా ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాకపోవడం తో కొత్త కథతో సినిమా ను తెరకేక్కిస్తున్నట్లు తెలుస్తుంది.కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో శ్రీనివాస్ తదుపరి చిత్రం ఉండనుంది.

ఈ చిత్రం కోసం ఇప్పటికే ఈ యంగ్ హీరో సిక్స్ ప్యాక్ కూడా సిద్ధం చేసుకున్నాడు.విజయ్‌ హీరోగా తమిళ్‌లో ఘనవిజయం సాధించిన తెరీ సినిమాను తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి.

ముందుగా పవన్‌ తెరీ రీమేక్‌కు ఓకే చెప్పిన తరువాత ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు.

Telugu Bellamkonda, Theri-

తరువాత రవితేజ హీరోగా ఆ బెల్లంకొండ సురేష్‌ బ్యానర్‌లో ఆ సినిమా ప్రారంభమైన అనివార్య కారణాలతో ఆగిపోయింది.తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కంటిన్యూ చేయాలని భావించినా తరువాత తెరీ రీమేక్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి కొత్త కథతో చిత్రాన్ని తెరక్కించనున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం కామెడీ యాక్షన్‌ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్.

నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube