ఆ హీరోయిన్ కోసం డబ్బులు విసురుతున్న బెల్లంకొండ.. మరీ ?  

సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా రాణిస్తూ, ఎన్నో భారీ హిట్ చిత్రాలను నిర్మించి తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాతలలో బెల్లంకొండ సురేష్ ఒకరు.అయితే బెల్లంకొండ వారసుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ “అల్లుడు శీను” సినిమా ద్వారా తెలుగు అరంగ్రేటం చేశారు.

TeluguStop.com - Bellamkonda Chatrapati Heroine Kiara Advani

ప్రముఖ నిర్మాత కొడుకు కావడంతో బెల్లంకొండ శ్రీనివాస్ తన సినిమాలలో టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్లనే పెట్టుకునేవాడు.శ్రీనివాస్ సరసన నటించడానికి ఆ హీరోయిన్లకు భారీ మొత్తంలోనే పారితోషికాన్ని ముట్ట చెప్పేవారని సమాచారం.

అయితే బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమా అల్లుడు శీనులో సమంత సరసన నటించారు.ఈ సినిమాలో నటించడానికి సమంత కు అధిక మొత్తంలోనే రెమ్యూనరేషన్ ఇచ్చారని సమాచారం.

TeluguStop.com - ఆ హీరోయిన్ కోసం డబ్బులు విసురుతున్న బెల్లంకొండ.. మరీ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పటికే కాజల్ అగర్వాల్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్ల సరసన నటించారు.ప్రస్తుతం బెల్లంకొండ బాలీవుడ్ డెబ్యూలో కూడా తన పక్కన స్టార్ హీరోయిన్ నటించాలని కోరుకుంటున్నాడు.

తెలుగులో వివి వినాయక్ దర్శకత్వం వహించిన చత్రపతి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు.ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా అద్వానీ అయితే బాగుంటుందని బెల్లంకొండ శ్రీనివాస్ భావిస్తున్నారు.

భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగులోకి ఎంటర్ అయిన కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ లో ఎంతో బిజీగా గడుపుతున్నారు.బాలీవుడ్ అగ్ర హీరోలతో నటిస్తున్న కియారా ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ మూవీలలో నటించే అంత క్రేజ్ ని సంపాదించుకున్నారు.

బాలీవుడ్ లో ఇంత క్రేజీ హీరోయిన్ గా ఉన్న కియారా అద్వాని ఒప్పించాలంటే భారీ మొత్తంలోనే పారితోషికం అందించాల్సి ఉంటుందని భావిస్తున్నారు.ఒకవేళ తన అడిగినంత పారితోషకాన్ని అందించిన ఈ డెబ్యూ సినిమాలో నటించడానికి కియారా ఒప్పుకుంటుందా? లేదా? అన్న అనుమానం కలుగుతోంది.

#HeroineKaira #Bellamkonda Sai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bellamkonda Chatrapati Heroine Kiara Advani Related Telugu News,Photos/Pics,Images..