షూటింగ్ షురూ చేసిన బెల్లంకొండ బాబు… ఈసారైనా హిట్ కొడతాడా..?  

bellam konda Sai Srinivas alludu adhurs movie Shooting Started, bellam konda Sai Srinivas, Alludu adhurs, Shooting update, Santhosh Srinivas, Tollywood - Telugu Alludu Adhurs, Bellam Konda Sai Srinivas, Bellam Konda Sai Srinivas Alludu Adhurs Movie Shooting Started, Santhosh Srinivas, Shooting Update, Tollywood

తెలుగులో ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించిన “అల్లుడు శ్రీను” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయినటువంటి “బెల్లంకొండ సాయి శ్రీనివాస్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.వచ్చీ రావడంతోనే తన మొదటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించిన సాయి శ్రీనివాస్ ఆ తరువాత ఎందుకో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

TeluguStop.com - Bellam Konda Sai Srinivas Alludu Adhurs Movie Shooting Started

దీంతో తన సినీ కెరియర్లో బెల్లంకొండ బాబు కి చెప్పుకోవడానికి సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు.

కాగా ప్రస్తుతం తెలుగులో రభస, హైపర్, కందిరీగ, తదితర చిత్రాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రౌతు దర్శకత్వం వహిస్తున్న“అల్లుడు అదుర్స్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

TeluguStop.com - షూటింగ్ షురూ చేసిన బెల్లంకొండ బాబు… ఈసారైనా హిట్ కొడతాడా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే గత కొద్ది నెలలుగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్  విధించడంతో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులను చిత్ర యూనిట్ సభ్యులు వాయిదా వేశారు. అయితే ఈ మధ్య షూటింగులకు అనుమతి ఇవ్వడంతో ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులను చిత్ర యూనిట్ సభ్యులు ప్రారంభించారు.

దీంతో ఈ రోజు షూటింగ్ లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అలాగే ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

అయితే చాలా రోజుల తర్వాత షూటింగ్ మొదలు కావడంతో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులను తొందరలోనే పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నాడు.అయితే ఆ మధ్య సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

దీంతో అల్లుడు అదుర్స్ చిత్రంతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

#BellamKonda #Shooting Update #Alludu Adhurs #BellamKonda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bellam Konda Sai Srinivas Alludu Adhurs Movie Shooting Started Related Telugu News,Photos/Pics,Images..