బార్ లో కాల్పుల మోత...11 మంది మృతి!  

Belem Shooting: 11 Killed In \'massacre\' At Bar In North Brazil-telugu Viral News,viral In Social Media,బార్ లో కాల్పుల మోత...11 మంది మృతి!,బార్ లో కాల్పులు

బ్రెజిల్ లోని ఒక బార్ లో కాల్పుల మోత మోగింది. బ్రెజిల్ లోని పారా రాష్ట్రం లో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కార్లు,బైక్ లపై వచ్చిన ఏడుగురు దుండగులు బెలెమ్ నగరంలోని ఒక బార్ లోకి ప్రవేశించి బార్ లో ఉన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లు తెలుస్తుంది..

బార్ లో కాల్పుల మోత...11 మంది మృతి!-Belem Shooting: 11 Killed In 'massacre' At Bar In North Brazil

దీనితో ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా కొందరు గాయపడినట్లు సమాచారం. అయితే వెంటనే సమాచార అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొనే సరికే ఆ దుండగులు పారిపోయినట్లు తెలుస్తుంది.

కానీ దుండగులలో ఒకరిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. దీని గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఈ కాల్పుల్లో మృతి చెందిన వారిలో ఆరుగురు మహిళలు,ఐదుగురు పురుషులు మృతి చెందినట్లు అధికారులు స్ఫష్టం చేశారు.

మొత్తం ఏడుగురు దుండగులు ఈ ఘటనలో పాల్గొనగా ఒకరిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోగా,మిగిలిన ఆరుగురు పరారీ లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అసలు వారు ఈ విధంగా బార్ లో ఎందుకు కాల్పులకు పాలపడ్డారు,ఈ దాడి వెనుక కారణాలు ఏంటి అన్న వివరాలు మాత్రం వెల్లడికాలేదు. మరోపక్క ఈ ఘటన తో బ్రెజిల్ నగరం ఉలిక్కిపడింది.