లెబనాన్ విధ్వంసం: ఆ చిన్నారిని క్షణాల్లో రక్షించిన మహిళ!

నిన్న లెబనాన్ రాజధాని బేరూత్‌లో భారీ పేలుడు జరిగిన సంగతి తెలిసిందే.ఈ భారీ పేలుడుతో ప్రపంచం అంత ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది.

 Beirut Explosion, Woman, Children, Home, Video Viral, Lebanon Blast-TeluguStop.com

ఈ పేలుడులో ఏకంగా 100 మందికిపైగా చనిపోయారు.నాలుగు వేలమందికిపైగా గాయపడ్డారు.

పోర్టులో చోటుచేసుకున్న ఈ పేలుడు వల్ల సగానికి పైగా నగరం ధ్వంసమైంది.

క్షణాల వ్యవధిలో ఎంతో పెద్ద భవనాలు అన్ని నేలమట్టం అయ్యాయి.

ఇంకా ఈ ఘటన కారణంగా సమీప ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల అద్దాలు, సామాన్లు అన్ని ద్వంసం అయ్యాయి.అయితే ఈ నేపథ్యంలోనే ఓ ఇంట్లో ఉన్న మహిళా గదులను శుభ్రం చేస్తుండగా అద్దాల కిటికీల వద్ద ఆడుకుంటున్న చిన్నారిని క్షణాల్లో రక్షించింది.

భారీ శబ్దానికి అద్దాలు పగలగానే ఆమె చిన్నారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియో చూస్తే మీరు కూడా ఆ మహిళను మెచ్చుకుంటారు.ఇకపోతే లెబనాన్‌లో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి.

కాగా పోర్టులోని గోదాములో గత ఆరేళ్లుగా ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ఉంచిన పేలుడు పదార్ధాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అందరూ భావిస్తున్నారు.