టీడీపీ విజయం వెనుక.. అసలు రహస్యం అదే !

వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కడుపుతున్న టిడిపి.ఆ దిశగా ఒక్కో అడుగు వేస్తూ బలం పెంచుకుంటోంది.

 That Is The Secret Behind Tdp's Success! , Tdp,  Panchamarti Anuradha, Kotam Red-TeluguStop.com

గత ఎన్నికల్లో 23 స్థానాలకే పరిమితం అయి ఘోరంగా ఓటమిపాలు అయిన టీడీపీ( TDP ).ఈసారి వైసీపీ సర్కార్ ను ఎలాగైనా గద్దె దించాలని పట్టుదలతో ఉంది.అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ జగన్ కు చెక్ పెట్టె ప్రయత్నాలు చేస్తోంది.ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో గెలుపొంది వైసీపీకి గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

ఇక ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది.మొత్తం ఏడు స్థానాలకు ఎన్నికలు జరగగా అందులో 6 స్థానాలను వైసీపీ, ఒక స్థానాన్ని టీడీపీ అభ్యర్థి పంచమర్తి అనురాధ( Panchamarti Anuradha ) గెలుపొందారు.

Telugu Ap Mlc, Chanrababu, Ys Jagan-Politics

అయితే ఎమ్మెల్యేల సంఖ్యాబలం అధికంగా ఉన్న వైసీపీని కాదని.టీడీపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకోవడమే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.ఎందుకంటే జగన్( Jagan ) సర్కార్ పై ఎంతో కొంత వ్యతిరేకత ఉందనే విషయం ఎమ్మెల్సీ ఎన్నికలతో నిరూపితం అయింది.అయితే ఇప్పుడు సొంత ఎమ్మెల్యేలలో వైఎస్ జగన్ పై వ్యతిరేక ఉందనేది తాజాగా జరిగిన ఏమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలతో రుజువైంది.

అయితే 151 ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరినీ వదులుకోవడానికి తాను సిద్దంగా లేనని వైఎస్ జగన్ పలుమార్లు చెప్పుకొచ్చారు.అయితే తాజా పరిణామాలను బట్టి చూస్తే వైసీపీలో కొంతమంది ఎమ్మేల్యేలు జగన్ పై అసంతృప్తిగా ఉన్నట్లు అర్థమౌతోంది.

అయితే ఏమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని, వైసీపీ చెబుతోంది.

Telugu Ap Mlc, Chanrababu, Ys Jagan-Politics

అయితే ఇందులో నిజనిజాలు పక్కన పెడితే వైసీపీలోని కొంతమంది ఎమ్మేల్యేలు టీడీపీకి ఓటు వేయడం వల్లే టీడీపీ అభ్యర్థి పంచమర్తి అనురాధ గెలుపొందరనేది జగమెరిగిన సత్యం.అయితే ఇటీవల సొంత పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్న వైసీపీ రెబెల్ ఎమ్మేల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి( Kotam Reddy Sridhar Reddy ), ఆనం వంటివాళ్లు కచ్చితంగా వైసీపీకి ఓటు వేసే చాన్సే లేదు.వీరితో పాటు ఇంకొంత మంది కూడా ఎమ్మేల్యేలు లోలోపల వైఎస్ జగన్ పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

వీళ్ళు ఏ క్షణంలోనైనా వైసీపీకి టాటా చెప్పే అవకాశాలు ఉన్నాయి.మరి వాళ్ళు ఎవరనేది ఇప్పటికైతే ప్రశ్నార్థకమే.ఏది ఏమైనప్పటికి వరుస షాక్ లతో వైసీపీ కుదేలవుతుండగా.ఒక్కో మెట్టు ఎక్కుతూ టీడీపీ బలం పెంచుకుంటోంది.

మరి ఈ పరినమలన్ని కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గట్టిగానే ప్రభావం చూపే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube