దేవాలయాలకు విరాళాలు అందిస్తున్న బిచ్చగాడు

చదువు కొని నెలా నెలా ఉద్యోగం చేసుకుంటూ డబ్బులు సంపాదించే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.వేలకు వేలు సంపాదిస్తున్నా ఆలయాలకు విరాళాలు ఇవ్వడానికి ఎంతో ఆలోంచించే వారు చాలా మందే ఉన్నారు.

 Beggar Is Giving Funds To Temples-TeluguStop.com

కానీ ఒక బిచ్చగాడు మాత్రం తాను సంపాదించిన ఒక్కో రూపాయిని దాచి పెట్టి మరీ ఆలయ అభివృద్ధి కోసం విరాళంగా ఇచ్చి తన మనసును చాటుకున్నాడు.శ్రీకాకుళం జిల్లా లో నివసించే ఒక బిచ్చగాడు ఈ విధంగా ఆలయ అభివృద్ధి కి విరాళం అందించాడు.

చేబోలు కామరాజు అనే వ్యక్తి అరవై ఏళ్ల క్రితం ఏదైనా వ్యాపారం చేద్దామని విజయనగరం జిల్లా చీపురు పల్లికి వచ్చారు.అయితే అక్కడే స్థిరపడి పోయిన ఆయన కాళ్లు అనుకోకుండా చచ్చుపడిపోయాయి.

దీనితో అతని కుటుంబానికి కూడా దూరమయ్యాడు.ఈ క్రమంలో జీవితం పై విరక్తి చెందిన ఆయన తన తదుపరి జీవితం దేవుడి సన్నిధి లోనే గడపాలని భావించి ఆలయం ముందు యాచించడం మొదలు పెట్టాడు.

దేవాలయాలకు విరాళాలు అందిస్తు

భక్తులు వేసే చిల్లర నాణేలను కూడబెట్టి రూ.3 లక్షల ఐదు వేల రూపాయిలను ఏ గుడి అయితే తనకు ఆశ్రయం కల్పించిందో ఆ గుడి అభివ‌ద్ధికే విరాళంగా అందజేసి అందరి మెప్పు పొందాడు.ఆ ఒక్క ఆలయం కే కాకుండా ఇటీవల ఆ పట్టణం లోని రావివలస కూడలి సమీపంలో ఉన్న భారీ ఆంజనేయస్వామి విగ్రహం భక్తుల సౌకర్యార్ధం షెడ్డు నిర్మాణానికి కూడా 30వేల రూపాయలు అందించినట్లు తెలుస్తుంది.నిజంగా బిచ్చమెత్తుకుంటున్న ఒక వ్యక్తి ఈ విధంగా దేవాలయాలకి విరాళాలు అందించి ఆ పట్టణం లో ఎంతో పేరు తెచ్చుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube