దేశభక్తి అంటే ఇది..సోషల్ మీడియాను కదిలించిన ఫోటో..   Beggar At August 15th Flag Facebook Viral Pic     2018-08-16   12:54:53  IST  Rajakumari K

72వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాన్ని ఘనంగా జరుపుకున్నాం.దేశ రాజధాని ఎర్రకోటలో ప్రధాని..రాష్ట్ర రాజధానిలోని గోల్కోండ కోటలో కేసీఆర్ ..ఇంకా పలు చోట్ల పలువురు నాయకులు మువ్వన్నెల జెండాను ఎగరేసారు.ఢిల్లీ నుండి గల్లీవరకు ఎగిరిన జెండాలను చూసి దేశభక్తితో ఛాతి ఉప్పొంగిపోయింది..స్వతంత్రదినోత్సవ సంబరాలు ముగిశాయి. కాని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒక ఫోటో మాత్రం మన నరనరాల్లో ఇంకి ఉన్న దేశభక్తిని తట్టిలేపుతుంది..

జాతీయ జెండాను ఎగరేస్తుండటం చూసి.. మాసిపోయిన దుస్తులతో అటుగా వెళ్తున్న ఓ పెద్దమనిషి .. జెండాకు సెల్యూట్ చేస్తున్న ఫొటో అందర్నీ కదిలిస్తోంది.విశేషం ఏంటంటే చూడడానికి పిచ్చివాడిలా ఉన్న అతను జెండాకి సెల్యూట్ చేసేటప్పుడు చెప్పులు విడిచి మరీ సెల్యూట్ చేయడం అందరిని ఆకట్టుకుంటుంది. దేశభక్తికి పేదరికం అడ్డురాదని.. గుండెల నిండా దేశం పట్ల ప్రేమ ఉంటే చాలని ఈ ఫొటో నిరూపిస్తోంది.ఈ ఫోటో ఎవరు తీశారో, ఎక్కడ తీశారో తెలీదు కానీ.. చూడగానే ఈ ఫొటో మాత్రం మనసుల్ని కట్టి పడేస్తోంది…