వెంకీ సినిమా మొదలుపెట్టకముందే లక్షలు ఖర్చు పెట్టారట.. తెరవెనుక కథ ఇది!

సాధారణంగా ఒక సినిమాను తెరకెక్కించాలంటే ప్రస్తుతం కొన్ని కోట్లలో బడ్జెట్ అవసరమవుతుంది.అలా ఎంతో భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించే ప్రేక్షకులకు ముందుకు సరికొత్త సినిమాలను పరిచయం చేస్తుంటారు.

 Before The Venky Movie Started They Spentis Lakhs And This Is Behind The Story-TeluguStop.com

అయితే ఏ సినిమాకు లేని విధంగా విక్టరీ వెంకటేష్ నటించిన టువంటి ఓ సినిమా మొదలుపెట్టక ముందే ఏకంగా లక్షలు ఖర్చు చేసి సినిమాను తెరకెక్కించారు.సినిమా ప్రారంభానికి ముందే ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన ఆ నిర్మాత సినిమాను విడుదల చేసిన తర్వాత ఎలాంటి ఫలితం వస్తుందోనని తెగ కంగారు పడ్డారు.

అయితే అతను ఊహించిన దానికన్నా సినిమా అద్భుతమైన విజయం అందుకోవడంతో నిర్మాత గట్టెక్కారు.ఇంతకీ ఆ సినిమా ఏంటి సినిమాకు ముందు అంత డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

 Before The Venky Movie Started They Spentis Lakhs And This Is Behind The Story-వెంకీ సినిమా మొదలుపెట్టకముందే లక్షలు ఖర్చు పెట్టారట.. తెరవెనుక కథ ఇది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించినటువంటి సుందరకాండ చిత్రం ఏ విధంగా విజయం అందుకుందో మనకు తెలిసిందే.ఈ చిత్రం తమిళంలో భాగ్యరాజా నటించిన ‘సుందరకాండ’ చిత్రం హిట్‌ కావడంతో డబ్బింగ్‌ హక్కులు కొని, డబ్బింగ్‌ చేశారు నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ.ఈ చిత్రానికి రామానాయుడు స్టూడియోలో అనువాదకార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా చూసిన వెంకటేష్ ఈ సినిమాలో నటించాలని పట్టుబడ్డారు.

అప్పటికే ఈ సినిమా పూర్తి కావడంతో ఈ సినిమాలో వెంకటేష్ చేస్తానని చెప్పడం వల్ల నిర్మాత కొందరు బయ్యర్లను కన్విన్స్ చేసి వాళ్ళు ఇచ్చిన దాని కన్నా రెట్టింపు చెల్లించి ఈ సినిమా వెర్షన్‌ డ్రాప్‌ చేసుకున్నారు.

Telugu Film Industry, Hero, Tollywood, Venkatesh-Movie

అంతా సక్రమంగా ఉందనుకున్న సమయంలో భాగ్యరాజా దగ్గర డబ్బింగ్‌ రైట్స్‌ మాత్రమే తీసుకోవడంతో అగ్రిమెంట్‌లో ఎక్కడా రీమేక్‌ అన్న పదం రాయకపోవడంతో ఈ సినిమా రీమేక్ హక్కులను 50 లక్షలు చెల్లిస్తే కానీ ఇవ్వనని భాగ్యరాజా డిమాండ్ చేశారు.చివరికి 25 లక్షలు చెల్లించి రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు.అనంతరం ఈ సినిమా డబ్బింగ్‌ వెర్షన్‌కు పది లక్షలు, బయ్యర్లకు పది లక్షలు, రీమేక్‌ రైట్స్‌కు పాతిక లక్షలు మొత్తం కలిపి సినిమా మొదలు కాకుండానే 45 లక్షల రూపాయలను ఖర్చు చేశారు.

అయితే ఈ సినిమా విడుదలయ్యే అద్భుతమైన విజయం అందుకోవడంతో నిర్మాతకు ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా లాభాలు వచ్చాయని చెప్పవచ్చు.

#Venkatesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు