విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ డైరక్షన్ లో నాని నిర్మించిన సినిమా హిట్.సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా 2020లో రిలీజై సూపర్ హిట్ అందుకుంది.
ఇక ఆ సినిమా ఎండింగ్ లో హిట్ 2 ఉంటుందని హింట్ ఇచ్చిన మేకర్స్ అనుకున్నట్టుగానే హిట్ 2 తెరకెక్కించారు.హిట్ 2 సినిమాలో హీరో మారాడు.
విశ్వక్ సేన్ బదులుగా అడివి శేష్ హీరోగా ఈ సినిమా రూపొందింది.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.
జూలై 29న రిలీజ్ అవుతున్న ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుందని తెలుస్తుంది.
హిట్ 2 సినిమా రిలీజ్ కు ముందే ప్రాఫిట్స్ వచ్చినట్టు తెలుస్తుంది.సినిమా డిజిటల్ రైట్స్ 7.5 కోట్లకు అమ్ముడవగా హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా మరో ఏడున్నర కోట్లు పలికాయట.సినిమా బడ్జెట్ 10 కోట్లు పెట్టగా డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ బిజినెస్ తోనే సినిమాకు లాభాలు వచ్చాయి.ఇక థియేట్రికల్ బిజినెస్ కాకుండానే ఈ సినిమా లాభాలు రాబట్టగా సినిమా మొత్తానికి ప్రాఫిటబుల్ వెంచర్ అని అర్ధమవుతుంది.
హీరోగానే కాదు నిర్మాతగా కూడా నాని తన సత్తా చాటుతున్నారు.