బీట్‌రూట్.తియ్యటి రుచిని కలిగి ఉండటమే కాదు.బోలెడన్ని పోషక విలువలను సైతం నిండి ఉంటుంది.అందుకే ఆరోగ్యానికి బీట్ రూట్ ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.చర్మ సౌందర్యాన్ని పెంచడంలో బీట్ రూట్ సహాయపడుతుంది.
అలాగే కేశాలకు కూడా బీట్ రూట్ ఉపయోగపడుతుంది.ముఖ్యంగా స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎందరినో బాధించే చుండ్రును బీట్ రూట్ చాలా సులభంగా నివారిస్తుంది.
మరి చుండ్రును వదిలించుకోవాలనుకుంటే బీట్ రూట్‌ను ఎలా వాడాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక బౌల్ తీసుకుని అందులో పావు కప్పు బీట్ రూట్ రసం, పావు కప్పు కొబ్బరి పాలు, ఒక స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు మరియు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.
గంట లేదా రెండు గంటల అనంతరం కెమికల్స్ లేని షాంపూను యూజ్ చేసి హెడ్ బాత్ చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య పరార్ అవుతుంది.

అలాగే బీట్ రూట్ ఉపయోగించి మరో విధంగా కూడా చుండ్రును నివారించుకోవచ్చు.అందు కోసం ఒక బౌల్ తీసుకుని అందులో అర కప్పు బీట్ రూట్ జ్యూస్, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ నిమ్మ రసం, ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.గంట తర్వాత గోరు వెచ్చటి నీటితో తల స్నానం చేయాలి.ఇలా చేసినా చుండ్రు పోతుంది.

ఇక ఒక బీట్ రూట్ తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి రసం తీసుకోవాలి.ఇప్పుడు ఈ రసాన్ని స్టవ్‌పై పెట్టి.మూడు లేదా నాలుగు నిమిషాల పాటు హీట్ చేయాలి.
ఆ తర్వాత చల్లారనిచ్చి.అందులో ఒక స్పూన్ వేప నూనె మిక్స్ చేసి తలకు పట్టించాలి.
రెండు గంటల అనంతరం హెడ్ బాత్ చేసిస్తే.చుండ్రుకు బై బై చెప్పొచ్చు.