తేనెటీగలను మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం.గుంపులు గుంపులుగా ఎక్కడికి వెళ్ళిన అన్ని ఒకటేసారి వెళ్లడం గమనిస్తూనే ఉంటాం.
ఒక్కొక్కటి ఒక్కో చోట కాకుండా అన్ని ఒకే ప్రాంతంలో ఉంటూ ఉంటాయి.ఇందుకు అసలైన కారణం ఆ గుంపులోని రాణి తేనెటీగ.
ఆ ఒక్క తేనెటీగ ఎక్కడికి వెళితే అక్కడికి మిగితా తేనెటీగలు వచ్చి వాలిపోతాయి.తాజాగా ఓ రాణి తేనెటీగ మొదటగా కలకత్తా ఎయిర్ పోర్ట్ లో ఉన్న విస్తారా విమానం పై వాలింది.
ఇంకేముంది ఆ రాణి తేనెటీగ రావడంతో ఆ తర్వాత వేల సంఖ్యలో తేనెటీగలు దాని చుట్టూ వచ్చి చేరాయి.దీంతో ఆ విమానాన్ని ఎక్కాల్సిన ప్రయాణికులు తెగ ఇబ్బంది పడిపోయారు.
ఎప్పుడు లేని విధంగా ఈ తేనెటీగలు విమానం పై దాడి చేయడంతో అధికారులకు ఏమి చేయాలో మొదటగా అర్థం కాలేదు.అయితే అప్పటికే ఆ విమానంలో 150 మంది ప్రయాణికులు ఎక్కాల్సి ఉండగా వారు ఇంకా ఎక్కక ముందే ఆ తేనెటీగలు అక్కడకు చేరడంతో అధికారులు చర్యలు చేపట్టారు.
మొదటగా అవి ఎన్ని ప్రయత్నాలు చేసినా విమానం నుంచి వెళ్లకపోవడంతో అధికారులకు పెద్ద సమస్యగా మారింది.అయితే ఓ ఉద్యోగి ఇచ్చిన సలహా మేరకు ఆ విమానంపై వాటర్ కెనాన్ లతో తేనెటీగలు ఉన్నచోట నీటిని పోస్తే సరిపోతుంది అని చెప్పగా, అధికారులు అదే చేసి విజయం సాధించారు.
దాంతో విమాన అధికారులకు ఓ టెన్షన్ తీరినంత పనైపోయింది.అయితే ఈ ఆపరేషన్ లో భాగంగా మరో రెండు ఫైరింజన్లను కూడా అధికారులు ఏర్పాటు చేశారు.అయితే, తేనెటీగలు వెళ్లిపోయిన సరి అధికారులకు మరో కొత్త సమస్య వచ్చి పడింది.ఏమైనా తేనెటీగలు విమానంలోకి వెళ్లి ఉంటే తర్వాత ప్రయాణికులు ఇబ్బంది పడతారన్న ఆలోచనలతో విమానం లోపల ఫ్యూమీగేషన్ ను చేశారు.
దీంతో ఆ విమానం బయల్దేరడానికి కాస్త ఎక్కువ సమయం ఆలస్యమైంది.
ఆ విమానం వెళ్లిపోయిన తర్వాత కలకత్తా విమానాశ్రయంలో మరెక్కడా తేనెటీగలు లేవని అధికారులు చెప్పుకొచ్చారు.అంతేకాదు అలాంటి తేనెటీగలు మళ్ళీ తిరిగి రాకుండా ఉండేందుకు ఆ పరిసరాల్లో భారీగా పురుగు మందులు స్ప్రే చేశారు.ఆ తర్వాత అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎక్కడ కూడా తేనెటీగలు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
మొత్తానికి ప్రయాణికులకు సమయం ఆలస్యం తప్పించి ఎటువంటి ప్రాణహాని కలగకపోవడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు.