పొలంలో బయటపడ్డ బీరువాలు.. షాకైన రైతు.. సీన్ కట్ చేస్తే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.కొన్ని రోజులుగా పొలాన్ని సాగుచేయని ఆ రైతు.

 Beerwa Left On The Farm  Farmer Was Shock If The Scene Is Cut , Beerwa, Viral Ne-TeluguStop.com

తాజాగా పొలంలో ఇసుకను తీసేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలో అందులో బీరువాలు ప్రత్యక్షమయ్యాయి.

ఇంకే ముంది విషయం ఆ నోటా.ఈ నోటా.

అందరికీ తెలిసింది.ఇవి రాజుల కాలం నాటివని పుకార్లు షికార్లయ్యాయి.

అసలు ఏం జరిగిదంటే.తాజాగా పెన్నానదికి వరదలు పోటెత్తడంతో ఇందుకూరుపేట మండలం మురివర్తిపాళానికి చెందిన రైతు నాగరాజు పొలం వద్ద కట్ట తెగిపోయింది.

గ్రామమంతా నీటిలో మునిగిపోయింది.ఈ కారణంగా సుమారు మూడు నెలలుగా అతని పొలంలో నీరు అలాగే ఉండి పోవడంతో అతడు వ్యవసాయ పనులు చేయలేదు.

తాజాగా తన పొలం నుంచి నీటిని మళ్లించి ఇసుకనున తొలగించే ప్రయత్నం చేశాడు.

పొలం నుంచి నీటిని బయటకు పంపించిన తర్వాత భూమిలో ఆరు స్టీల్ బీరువాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.

దీంతో ఆ రైతు షాకయ్యాడు.విషయం గ్రామస్తులకు తెలియడంతో కొందరు అక్కడికి చేరుకుని అ బీరువాలు మావేనంటూ వాటిని తీసుకెళ్లి పోయారు.

తర్వాత ఆ పొలంలో బైక్ సైతం బటయపడింది.దీంతో ఈ విషయాన్ని సదురు రైతు వెంటనే స్థానిక తహసీల్దార్, ఎస్ఐకు సమాచారం అందించాడు.

దీంతో అక్కడికి చేరుకున్న ఏఎస్ఐ.బైక్‌ను తీసి స్వాధీనం చేసుకున్నారు.

పొలంలో బీరువాలు బయట పడిన విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వాస్తవానికి ఇటీవలే వరదలు, వర్షాలు పల్లెలను ముంచెత్తాయి.

ఈ క్రమంలో ఇండ్ల నుంచి బీరువాలు వరదలకు కొట్టుకుపోయి.పొలాల్లోకి చేరాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇక చుట్టు పక్కల పొలాల్లో సైతం ఇంకెన్ని వస్తువులు బయటపడతాయోనని అంటున్నారు.మరి ఇతర పొలాల్లో ఇసుకను బయటకు తీస్తే మరి ఏయే వస్తువులు బయటపడతాయోనని గ్రామస్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Beerwa Left On The Farm Farmer Was Shock If The Scene Is Cut , Beerwa, Viral News - Telugu Beerwa, Beerwafarm

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube