బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను చంపే తేనెటీగ విషం!  

bee venom to kill breast cancer, Bee venom, kills, breast cancer cells, triple negative, Breast Cancer - Telugu Bee Venom, Bee Venom To Kill Breast Cancer, Breast Cancer, Breast Cancer Cells, Kills, Triple Negative

క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.క్యాన్సర్ కారణంగా ఎంతోమంది మృతి చెందినవారు ఉన్నారు.

TeluguStop.com - Bee Venom Kills Breast Cancer Cells

ఇక అలాంటి క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి.తేనెటీగల నుంచి సేకరించిన విషాలు రొమ్ము క్యాన్సర్ రావడానికి కారణమయ్యె కణాలను చంపేయగలవని ప్రయోగశాల పరిశోధనల్లో తేలినట్లు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అంటున్నారు.

తేనెటీగల విషాల్లో ఉండే మెలిటిన్ అనే సమ్మేళనాన్ని చికిత్సకు లొంగని క్యాన్సర్ రకాలు “ట్రిపుల్ – నెగటివ్ “, హెచ్ ఈ ఆర్ 2-ఎన్రిచ్డ్ పై ప్రయోగించారు.ఈ ప్రయోగం సక్సెస్ అయ్యిందని అంటున్నారు.
కానీ ఈ అంశంపై మరింత పరిశోధన చేయాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.ప్రపంచంలో ఎక్కువ మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు.అయితే తేనెటీగల విషంతో ప్రయోగశాలల్లో చేసే అధ్యయనాల్లో అనేక రసాయన సమ్మేళనాలు క్యాన్సర్ తో పోరాడగలవని ఫలితాలు రావచ్చు కాని వాటిలో మానవులకు చికిత్సగా అందిచగలిగేవి కొన్ని మాత్రమే వుంటాయని శాస్త్రవేత్తలు చెప్పుతున్నారు.

TeluguStop.com - బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను చంపే తేనెటీగ విషం-General-Telugu-Telugu Tollywood Photo Image

తేనె టీగ విషాల్లో క్యాన్సర్ ను నిరోదించగల లక్షణాలు ఉన్నాయని ఇంతకు ముందు చేసిన అధ్యయనాల్లోను వెల్లడైంది.

ప్రస్తుతం అధ్యయనం దక్షణ ఆస్ట్రేలియాలోని హ్యారిపెర్కిన్స్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో జరిగింది.ఇది నేచర్ ప్రెసిషన్ అడాలజీ జర్నల్ లో ప్రచురితమైనది.

ఈ అధ్యయనం ఏం చెబుతుందంటే.ఈ అధ్యయనం కోసం 300కన్నా ఎక్కువ తేనెటీగల విషాలను సేకరించి పరిశీలించారు.

సేకరించిన విషం చాలా శక్తివంతమైనది అని అధ్యయన పరిశోధకురాలు సియారా డఫీ చెప్పారు.తేనెటీగల విషాల్లో ఉండే మెలిటిన్ సమ్మేళనం క్యాన్సర్ కణాలను పూర్తిగా నాశనం చేయగలదని ప్రయోగాల్లో తేలింది.

తేనెటీగల్లో సహజంగానే మెలిటిన్ దొరుకుతుంది.అయితే దీన్ని కృత్రిమంగా కూడ ఉత్పత్తి చేయవచ్చు.

రొమ్ము క్యాన్సర్ రకాల్లో 10-15శాతం ఉండే ట్రిపుల్ -నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కఠినమైనది అని పరిశోధకులు చెప్తున్నారు.

#Kills #Breast Cancer #BreastCancer #Bee Venom #BeeVenom

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bee Venom Kills Breast Cancer Cells Related Telugu News,Photos/Pics,Images..