అలా మా ఫ్యామిలీ రోడ్డుపై పడింది.. అమీర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు..?

బాలీవుడ్ ఇండస్ట్రీలో అమీర్ ఖాన్ స్టార్ హీరో అనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఒక్కో సినిమాకు రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకునే హీరోలలో అమీర్ ఖాన్ ఒకరు.

 Because Of This Reason Aamir Family Fell On Road-TeluguStop.com

అయితే ఒక సందర్భంలో తమ ఫ్యామిలీ రోడ్డుపై పడిందని అమీర్ ఖాన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తన తండ్రి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ అని అయినప్పటికీ నిర్మాతగా నాన్న డబ్బులు సంపాదించలేదని అమీర్ ఖాన్ అన్నారు.

తన తండ్రి దివాళా తీయడానికి కారణాల గురించి అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు.తన తండ్రి ఎంతో ఉత్సాహంగా సినిమాలను నిర్మించేవారని అయితే ఆయనకు బిజినెస్ ఏ విధంగా చేయాలో మాత్రం తెలియదని అమీర్ ఖాన్ అన్నారు.

 Because Of This Reason Aamir Family Fell On Road-అలా మా ఫ్యామిలీ రోడ్డుపై పడింది.. అమీర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందువల్ల నిర్మాతగా ఆయన ఏమీ సంపాదించలేకపోయారని అమీర్ ఖాన్ పేర్కొన్నారు.తన తండ్రి నిర్మాణంలో వచ్చిన సినిమాలో ఒక సినిమాకు ఎనిమిది సంవత్సరాల సమయం, మరో సినిమాకు మూడు సంవత్సరాల సమయం పట్టిందని అమీర్ ఖాన్ అన్నారు.

తన తండ్రికి సంబంధించి ఈ విషయం చాలామందికి తెలియదని అమీర్ ఖాన్ పేర్కొన్నారు.ఆ తరువాత తమ కుటుంబం దివాళా తీసి రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఏర్పడిందని అమీర్ ఖాన్ అన్నారు.తన తండ్రి యొక్క అనుభవాలు తనకు పాఠాలు అయ్యాయని అమీర్ ఖాన్ వెల్లడించారు.తాను ప్రొడ్యూసర్ గా మారడానికి హీరోగా ఈ స్థాయికి ఎదగడానికి పరోక్షంగా తండ్రే కారణమని అమీర్ ఖాన్ పేర్కొన్నారు.

తండ్రి గురించి అమీర్ ఖాన్ ప్రేక్షకులకు ఎవరికీ తెలియని విషయాలను వెల్లడించారు.అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.అమీర్ ఖాన్ వరుస విజయాలతో హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుండటం గమనార్హం.

#Fell On Road #BecauseOf #Aamir Family

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు