ఆ సినిమా కోసమే ఆర్తి అగర్వాల్ మరణించిందా..!

ఆర్తి అగర్వాల్.ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరేమో.అంతలా తెలుగులో గుర్తింపు సంపాదించుకుంది.తక్కువ సమయంలోనే టాప్ హీరోలందరితో కలిసి నటించింది.ఆర్తి అగర్వాల్ తెలుగులో దాదాపు 50 సినిమాలు చేసింది.కానీ ఈమె కొన్ని కారణాల వల్ల చిన్న వయసులోనే మరణించింది.

 Because Of That Movie Aarthi Agarwal Take The Decision Of Liposuction, Aarthi Ag-TeluguStop.com

ఈ రోజు ఆమె 37 వ జయంతి.

ఆర్తి అగర్వాల్ నువ్వు నాకు నచ్చావ్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది.ఈ సినిమాలో ఆమె వెంకటేష్ కు జంటగా నటించింది.మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది.ఈ సినిమా తర్వాత ఆర్తి అగర్వాల్ కు వరస ఆఫర్లు వచ్చాయి.దాదాపు స్టార్ హీరోలందరితో ఆమె నటించి మంచి హిట్స్ కూడా అందుకుంది.

ఆమె వరస ఆఫర్లతో దూసుకుపోతున్న సమయంలోనే బరువు పెరిగింది.దీనివల్ల ఆమె సినిమా ఛాన్సులు కోల్పోయింది.తర్వాత ఆమె 2007 సంవత్సరంలో ఉజ్వల్‌ నికమ్ ను పెళ్లి చేసుకుంది.అయితే వీరు కొంత కాలానికే మనస్పర్థల కారణంగా విడిపోయారు.

తర్వాత మళ్ళీ ఆర్తి అగర్వాల్ సినిమాల్లో నటించింది.అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన ఏ సినిమాలు అంతగా ఆడలేదు.

Telugu Aarthi Agarwal, America, Anniversary, Tollywood-Latest News - Telugu

ఆర్తి అగర్వాల్ బరువు కారణంగా సినిమా అవకాశాలు రావడం లేదని ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది.అప్పటి నుండి వ్యాయామాలు చేయడం మొదలు పెట్టింది.ఆర్తి అగర్వాల్ జంక్షన్‌లో జయమాలిని అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేయడానికి ఒప్పుకుంది.ఆ సినిమా కోసం బరువు తగ్గాల్సి వచ్చింది.వ్యాయామాలు చేస్తే కొంత బరువు అయితే తగ్గింది కానీ.పూర్తిగా తగ్గలేకపోయింది.

అప్పటికే 89 కేజీలు ఉండే ఆమె 63 కు తగ్గింది.అయితే మరో మూడు కేజీలు తగ్గడం కోసం ఆమె అమెరికాలో లైపో సెక్షన్ చేయించుకోవడానికి వెళ్ళింది.

అయితే లైపో సెక్షన్ సర్జరీ వికటించడంతో ఆమె గుండె పోటుతో జూన్ 6 2015 లో అకాల మరణం చెందింది.జంక్షన్‌లో జయమాలిని సినిమా కోసం బరువు తగ్గడానికి ఆమె చేసిన ప్రయత్నమే ఆమె ప్రాణాలు మీదకు తెచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube