గూగుల్‌ ఇమేజెస్‌ ప్రారంభం అవ్వడానికి ఆ హాట్‌ హీరోయిన్‌ కారణం.. ఎలాగో తెలుసా?  

Because Of Jennifer Lopez Google Images Started-dress,event,general Telugu Updates,google Images,jennifer Lopez,started,హీరోయిన్‌ కారణం

మినిమం చదువు వచ్చిన వారు కూడా ఫోన్‌లు వాడటం, కంప్యూటర్‌ వాడటం, ఇంటర్నెట్‌ విచ్చలవిడిగా వాడటంకు ప్రధాన కారణం గూగుల్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతమైన ఫీచర్స్‌తో ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగదాయకం అవుతున్నది గూగుల్‌. పీహెచ్‌డీ చేసిన వారి నుండి పది ఫెయిల్‌ అయిన వారి వరకు అంతా కూడా ఉపయోగించే విధంగా గూగుల్‌ ఉంటుంది..

గూగుల్‌ ఇమేజెస్‌ ప్రారంభం అవ్వడానికి ఆ హాట్‌ హీరోయిన్‌ కారణం.. ఎలాగో తెలుసా?-Because Of Jennifer Lopez Google Images Started

ప్రతి ఒక్కరికి సమాచారంను అందిస్తుంది. ఇక గూగుల్‌లో సమాచారంతో పాటు, వాటికి సంబంధించిన ఫొటోలు కూడా ఉంటాయి. బిలియన్‌ల కొద్ది ఫొటోలు గూగుల్‌లో కనిపిస్తాయి.

ఉదాహరణకు మహేష్‌ బాబు అని గూగుల్‌ ఇమేజెస్‌లో సెర్చ్‌ కొడితే కోట్లాది ఫొటోలు కనిపిస్తాయి. ఇలా ఏ స్టార్‌వి అయినా మరే ఇతర సెలబ్రెటీవి అయినా కనిపిస్తాయి.

గూగుల్‌ ఇన్ఫర్మేషన్‌ ఎలా అయితే సక్సెస్‌ అయ్యిందో అలాగే గూగుల్‌ ఇమేజెస్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది.

అద్బుతమైన ఫీచర్స్‌తో అందుబాటులో ఉన్న గూగుల్‌ ఇమేజెస్‌ ఎలా మొదలు అయ్యిందో అనే విషయం తెల్సిస్తే ఆశ్చర్యపోతారు. ఒక హాట్‌ లేడీ వల్ల గూగుల్‌ వారికి ఇమేజెస్‌ అనే ట్యాబ్‌ను ఏర్పాటు చేయాలని అనిపించింది. ఆ ఆలోచన నుండి వచ్చిందే గూగుల్‌ ఇమేజెస్‌.

ఆ హాట్‌ లేడీ మరెవ్వరో కాదు జెన్నిఫర్‌ లోపేజ్‌. అవును ఈమె వల్లే గూగుల్‌లో 2000వ సంవత్సరంలో ఇమేజెస్‌ అనే బటన్‌ను యాడ్‌ చేయడం జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… 2000వ సంవత్సరంలో హాలీవుడ్‌ నటి జెన్నీఫర్‌ లోపేజ్‌ అంతర్జాతీయ అవార్డులు అయిన గ్రామీ అవార్డ్‌ వేడుకల్లో హాజరు అయ్యింది. ఆ వేడుకల్లో ఆమె వేసుకున్న డ్రస్‌ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం అయ్యింది. దాంతో ఆమె గురించి, ఆమె డ్రస్‌ గురించి తెలుసుకునేందుకు ప్రపంచమంతా కూడా యువత ఎంతో ఆసక్తిని కనబర్చింది.

అందుకోసం ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున సెర్స్‌ చేశారు. అప్పట్లో గూగుల్‌ ఇన్ఫర్మేషన్‌ మాత్రమే ఇస్తున్న కారణంగా ఒకేసారి లక్షలాది మంది గూగుల్‌పై పడటంతో గూగుల్‌ సిస్టమ్స్‌ కూడా హ్యాంగ్‌ అయ్యే పరిస్థితికి వచ్చింది..

ఆ సమయంలోనే గూగుల్‌లో ఫొటోల కోసం ఒక బటన్‌ ఉంటే బాగుంటుంది, అది మొత్తం ఇంటర్నెట్‌లో ఉన్న ఫొటోలన్నింటిని తమ వినియోగదారుడి ముందు ఉంచాలని భావించారు. అనుకునేదే తడువుగా గూగుల్‌ ఇమేజెస్‌ ను ఏర్పాటు చేశారు.

ఈ విషయాన్ని స్వయంగా జెన్నీఫర్‌ లోపేజ్‌ పేర్కొంది. గూగుల్‌ వారు కూడా ఒప్పుకుని, ఈ విషయాన్ని షేర్‌ చేయడం జరిగింది. కోట్లాది మంది వినియోగిస్తున్న ఈ గూగుల్‌ ఇమేజెస్‌ ఆమె వల్ల అవ్వడంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపును గూగుల్‌ ఇస్తోంది..

మీరు ఏదో ఒక సందర్బంలో గూగుల్‌ ఇమేజెస్‌ను వాడే ఉంటారు. మీరు కనుక గూగుల్‌ ఇమేజెస్‌ను వాడి ఉంటే దీన్ని షేర్‌ చేసి, స్నేహితులతో పంచుకోండి.