అర‌టిపండే కాదు తొక్క‌లోనూ సౌంద‌ర్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి!!

అర‌టిపండు ఆరోగ్యానికి, చ‌ర్మానికి ఎంత మేలు చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర నుంచి ముస‌లివారి వ‌ర‌కు అంద‌రికీ అర‌టి పండు మంచి ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది.

అందుకే అంటారు ప్రకృతి ప్రసాదించిన పండ్లలో అర‌టి పండు కూడా ఒక‌ట‌ని.ఏ సీజ‌న్‌లో అయినా ల‌భించే అర‌టి పండ్లు ధ‌ర త‌క్కువ‌.

పోష‌కాలు ఎక్కువ అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు.అయితే అర‌టిపండు తినే స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ ఓ పొర‌పాటు చేస్తారు.

అదేంటంటే.పండు తినేసి తొక్క డ‌స్ట్‌బిన్‌లో వేయ‌డం.

ఇది పొర‌పాటు ఎలా అవుతుంది.? అనేగా మీ సందేహం.

ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్న అర‌టి తొక్క‌ను పారేయం ఎందుకు.అవును! అర‌టిపండే కాదు తొక్క‌తోనూ ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

"""/"/ ముఖ్యంగా చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరిపించుకోవ‌డంతో అర‌టిపండు తొక్క అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.మ‌రి అర‌టిపండు తొక్క‌ను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అర‌టిపండు తొక్క‌ను బాగా పేస్ట్ చేసి.అందులో కొద్దిగా ప‌సుపు మ‌రియు తేనె క‌లిపి ముఖానికి అప్లై చేయాలి.

పావు గంట సేపు అర‌నిచ్చి చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మానికి తేమ అంది.

మృదువుగా మారుతుంది.మ‌రియు ముఖంపై మృత క‌ణాల‌ను పొగొడ్డుతుంది.

అలాగే మొటిమ‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు అర‌టి తొక్క‌ని సంబంధిత ప్రాంతంలో మర్దన చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

అదే విధంగా, అర‌టి తొక్క‌ని పేస్ట్ చేసి.అందులో కొద్దిగా పెరుగు క‌లిపి ముఖానికి ప‌ట్టించాలి.

అర గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకుంటే.అరటి తొక్కలో ఉండే యాంటీ ఆక్సీడెంట్లు చ‌ర్మాన్ని కాంతివంత‌ంగా చేస్తుంది.

మ‌రియు ముడ‌త‌ల‌ను కూడా త‌గ్గిస్తుంది.

26వ రోజు కొనసాగుతున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం..