చిరంజీవిలో స్టెప్పులు వేయబోతున్న రెజినా  

Hot Beauty Regina Dance With Chiranjeevi-hot Beauty Regina,koratala Shiva,telugu Cinema,tollywood

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత మళ్ళీ తన ఒకప్పటి స్పీడ్ తో వరుసగా రెండు సూపర్ హిట్ సినిమాలతో తన ఖాతాలో వేసుకోవడంతో తనకి ఎప్పటికి తిరుగు లేదని నిరూపించుకున్నాడు.ఇక తాజాగా వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాతో ఒక యోధుడుగా తెరపై రౌద్రరసం పలికి ఔరా అనిపించుకున్నాడు.

Hot Beauty Regina Dance With Chiranjeevi-Hot Koratala Shiva Telugu Cinema Tollywood

తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకి నీరాజనం పట్టారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసుకొని కాస్టింగ్ సెలక్షన్ జరుగుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరోమారు చిరంజీవి మాస్ స్టెప్పులు అభిమానులు చూడబోతున్నారు.

ఇక ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ కూడా ఉంది.ఈ సాంగ్ కోసం చాలా మంది వర్ధమాన హీరోయిన్స్ ని చూసిన తర్వాత రెజినాని చిత్ర యూనిట్ ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో చిరంజీవి రీమేక్ సాంగ్ కి తేజ్ తో కలిసి ఒక రేంజ్ లో స్టెప్పులు వేసిన రెజినా అయితే చిరంజీవి డాన్స్ గ్రేస్ కి సరిపోతుందని, అతని వేగం అందుకోగలదని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.త్వరలో ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

.

తాజా వార్తలు

Hot Beauty Regina Dance With Chiranjeevi-hot Beauty Regina,koratala Shiva,telugu Cinema,tollywood Related....