టూట్ పేస్ట్ తో మీ అందాన్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసా?       2018-04-25   01:02:41  IST  Bhanu C

మనం సాధారణంగా టూట్ పేస్ట్ ని పళ్ళను శుభ్రం చేసుకోవటానికి ఉపయోగిస్తాం. అయితే టూట్ పేస్ట్ ని ఉపయోగించి అందాన్ని మెరుగుపరచు కోవచ్చని మీకు తెలుసా? టూట్ పేస్ట్ ఎన్నో చర్మ సమస్యలకు పరిష్కారం చూపుతుంది. అయితే ఒక విషయాన్నీ గుర్తుపెట్టుకోవాలి . కేవలం తెల్లని టూట్ పేస్ట్ ని మాత్రమే ఉపయోగించాలి. ఇప్పుడు టూట్ పేస్ట్ ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

అరస్పూన్ టూట్ పేస్ట్ లో అరస్పూన్ టమోటా గుజ్జు,ఒక స్పూన్ బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని నల్లని మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఒక స్పూన్ టూట్ పేస్ట్ లో ఒక స్పూన్ కలబంద గుజ్జు ముఖానికి రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమల సమస్య తగ్గిపోతుంది. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే క్రమంగా మొటిమలు తగ్గిపోతాయి.

ఒక స్పూన్ టూట్ పేస్ట్ లో ఒక స్పూన్ అరటి పండు గుజ్జు కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తో తలస్నానము చేస్తే జుట్టు చిట్లకుండా బాగా పెరుగుతుంది. ఈ విధంగా నెలలో ఒకసారైనా చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

,