తులసి ఆకులను, మొక్కలను మన భారత దేశంలో ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు.ఎన్నో పోషకాలు దాగి ఉన్న తులసి ఆకులు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.
తులసి ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, జింక్, మెగ్నీషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఇక కేవలం ఆరోగ్య పరంగా కాకుండా సౌందర్య పరంగానూ తులసి గ్రేట్‌గా సహాయపడుతుంది.
ముఖ్యంగా ఈ చలి కాలంలో వచ్చే చర్మ సమస్యలను నివారించడంలో తులసి ఎఫెక్టివ్‌గా ఉపయోగపడుతుంది.
మరి తులసి ఆకులను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా ఈ వింటర్ సీజన్‌లో చర్మం పొడిబారిపోతూ డ్రైగా మారుతుంటుంది.
అయితే తులసి ఆకులకు బాగా మొత్తగా చేసి రసం తీసుకుని.అందులో కొద్దిగా నిమ్మరసం యాడ్ చర్మానికి అప్లై చేయాలి.
బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.పొడి చర్మం దూరం అవుతుంది.

అలాగే ఈ చలి కాలంలో చాలా మంది చర్మంపై దురదలు, మంట, రాషెస్ వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు.అలాంటి వారు తులసి ఆకులను తీసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి.ఆ పేస్ట్‌లో ఇంట్లో తయారు చేసుకున్న పసుపు వేసి బాగా మిక్స్ చేసి.దురదలు, రాషెస్ ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి.ఒక అర గంట పాటు వదిలేసి.అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్‌గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఇక మొటిమలను నివారించడంలోనూ తులసి సూపర్‌గా ఉపయోగపడుతుంది.కొన్ని తులసి ఆకులను తీసుకుని పేస్ట్ చేసుకుని.అందులో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖాన్ని అప్లై చేసి.ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి మూడు సార్లు చేస్తే.
మొటిమలు, నల్ల మచ్చలు వంటి సమస్యలు దూరం అవుతాయి.