పైనాపిల్ జ్యూస్ ముఖ సౌందర్యానికి సహాయపడుతుందని తెలుసా?       2018-06-19   23:31:34  IST  Lakshmi P

సాధారణంగా పైనాపిల్ జ్యూస్ త్రాగితే ఆరోగ్యానికి మంచిదని అందరూ భావిస్తారు. అయితే పైనాపిల్ జ్యూస్ ముఖ సౌందర్యంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. చర్మ సమస్యలను తొలగించటంలో చాలా బాగా సహాయపడుతుంది. పైనాపిల్ జ్యూస్ లో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన చర్మ సమస్యల పరిష్కారంలో సహాయపడుతుంది. అయితే ముఖానికి పైనాపిల్ జ్యూస్ ను రాయటానికి ముందు చేతి మీద రాసి మంట,దురద వంటివి లేవని నిర్ధారణ చేసుకోవాలి. ఇప్పుడు పైనాపిల్ జ్యూస్ తో ఎన్ని అందం ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాము.

పైనాపిల్ జ్యూస్ లో ఉండే బ్రొమైలిన్ అనే ఎంజైమ్ మొటిమలను తగ్గించటమే కాకుండా చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మంపై ముడతలు లేకుండా చేస్తుంది.

ప్రతి రోజు ఒక గ్లాస్ పైనాపిల్ జ్యూస్ త్రాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది. పైనాపిల్ జ్యూస్ ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది.

పైనాపిల్ జ్యూస్ లో విటమిన్ సి, అమైనో యాసిడ్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మం సాగకుండా బిగుతుగా ఉండేలా చేస్తుంది. అంతేకాక చర్మంలో మృత కణాలను తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

పైనాపిల్ స్లైడ్ ని తీసుకోని ముఖం మీద రుద్ది పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు,మొటిమలకు కారణం అయిన జిడ్డు తొలగిపోతుంది.

పైనాపిల్ జ్యూస్ లో నిమ్మరసం కలిపి రాస్తే చర్మం యవ్వనంగా కనపడటమే కాకుండా కాంతివంతంగా ఉంటుంది.