ముడ‌తల‌కు, మ‌చ్చ‌ల‌కు చెక్ పెట్టే లావెండ‌ర్ ఆయిల్..ఎలాగంటే?

సాధార‌ణంగా కొంద‌రు ముడ‌త‌లు, న‌ల్ల మ‌చ్చ‌ల‌‌తో తెగ‌ బాధ ప‌డుతుంటారు.ఎంతో ఖ‌ర్చు పెట్టి ర‌క‌ర‌కాల క్రీములు, లోష‌న్లు కొనుగోలు చేసి వాడినా అవి త‌గ్గ‌నే త‌గ్గ‌వు.

 Beauty Benefits Of Lavender Oil-TeluguStop.com

దీంతో మాన‌సికంగా కృంగిపోతుంటారు.అయితే ముఖంపై ఉండే ముడ‌త‌ల‌కు, మ‌చ్చ‌ల‌కు చెక్ పెట్ట‌డంలో లావెండ‌ర్ ఆయిల్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

లావెండ‌ర్ మొక్క‌ల నుంచి తీసే లావెండ‌ర్ ఆయిల్ చ‌ర్మ సౌంద‌ర్యానికి ఎంతో మేలు చేస్తుంది.

 Beauty Benefits Of Lavender Oil-ముడ‌తల‌కు, మ‌చ్చ‌ల‌కు చెక్ పెట్టే లావెండ‌ర్ ఆయిల్..ఎలాగంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎన్నో చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను కూడా నివారిస్తుంది.

మ‌రి లావెండ‌ర్ ఆయిల్‌ను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ లావెండ‌ర్ ఆయిల్‌, ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి రెండు నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకుని బాగా ఆర‌నివ్వాలి.ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇలా ప్రతి రోజు చేస్తే క్ర‌మంగా ముడ‌త‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

అలాగే ఒక గిన్నెల్లో లావెండ‌‌ర్ ఆయిల్ తీసుకుని.అందులో కొద్దిగా అలోవెర జెల్ వేసి బాగా క‌లుపుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముకానికి పూత‌లా అప్లై చేసి ఇర‌వై నిమిషాల పాటు వ‌దిలేయాలి.

ఆ త‌ర్వాత కూల్ వాట‌ర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.

ముఖంపై ఉండే న‌ల్ల మ‌చ్చ‌లు క్ర‌మంగా త‌గ్గిపోవ‌డంతో పాటు చ‌ర్మ కాంతి కూడా పెరుగుతుంది.

ఇక మొటిమ‌ల స‌మ‌స్య‌ను తగ్గించ‌డంలోనూ లావెండ‌‌ర్ ఆయిల్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

లావెండ‌ర్ ఆయిల్ మ‌రియు టీ ట్రీ ఆయిల్ స‌మానంగా తీసుకుని క‌లుపుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి పావు గంట త‌ర్వాత్ క్లీన్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే మొటిమ‌లు మ‌టుమాయం అవుతాయి.‌‌

.

#BenefitsOf #Face Packs #Skin Care #LavenderOil #Beauty

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు