యాలకులు.వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.
వంటల్లో విరివిగా వాడే యాలకులు మంచి రుచి, వాసన అందించడంలో ముందుంటాయి.అలాగే యాలకుల వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
జీర్ణ సమస్యలు దూరం చేయడంలో, గుండె జబ్బుల నుంచి రక్షించడంలో, మధుమేహం రాకుండా అడ్డుకోవడంలో, డిప్రెషన్ నుంచి బయటపడేయంలో ఇలా యాలకులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.అయితే కేవలం ఆరోగ్య పరింగానే కాకుండా సౌందర్య పరంగానూ యాలకులు ఉపయోగపడతాయి.
మచ్చల్లేని, మృదువైన చర్మాన్ని అందించడంలో యాలకులు గ్రేట్‌గా సహాయపడతాయి.మరి యాలకులను చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.మొదటివి.ముందుగా కొన్ని యాలకులను తీసుకుని పొడిలా చేసుకోవాలి.
ఆ పొడిలో కొద్దిగా పాలు మిక్స్ చేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి.ఇప్పుడు ఆ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి.
ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడతాయి.అలాగే యాలకుల్లో విటమిన్ సి ఉంటుంది.
ఇది చర్మంపై ఉన్న ముడతలను తొలగించి.మృదువుగా మారుస్తుంది.
ఇక రెండొవది.యాలకులను తీసుకుని పొడిలా చేసుకోవాలి.
ఆ పొడిలో కొద్దిగా తేనె మరియు నిమ్మరసం వేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.
అరగంట పాటు వదిలేయాలి.ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.
ఇలా వారినికి ఒకటి లేదా రెండు సార్లు చేయడం వల్ల చర్మం టోన్ మెరుగుపడుతుంది.అలాగే ముఖంపై మృత కణాలు పోయి కాంతివంతంగా, అందంగా మారుతుంది.
మచ్చల్లేని, మృదువైన చర్మం పొందాలంటే ఈ టిప్స్‌ను తప్పకుండా ట్రై చేయండి.