ముఖ‌కాంతిని పెంచే క్రాన్‌బెర్రీస్‌..ఎలా వాడాలంటే?

క్రాన్‌బెర్రీస్ఈ పండ్లు ఇక్క‌డ పండేవి కావు.అయిన‌ప్ప‌టికీ మ‌న దేశంలోని సూపర్ మార్కెట్లలో విరి విరిగా ల‌భిస్తాయి.

 Beauty Benefits Of Cranberries-TeluguStop.com

చూసేందుకు ఎర్ర‌గా, గుండ్రంగా, చిన్న‌గా ఉండే క్రాన్‌బెర్రీస్ కాస్త తియ్య‌గా, కాస్త పుల్ల‌గా ఉంటాయి.అలాగే క్రాన్‌బెర్రీస్‌లో విట‌మిన్ సి, విట‌మిన్ బి, విట‌మిన్ కె, విట‌మిన్ ఇ, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, జింక్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.

అందుకే క్రాన్‌బెర్రీస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా నివారిస్తాయి.

 Beauty Benefits Of Cranberries-ముఖ‌కాంతిని పెంచే క్రాన్‌బెర్రీస్‌..ఎలా వాడాలంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు.చ‌ర్మానికి కూడా క్రాన్‌బెర్రీస్ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.ముఖ‌కాంతిని పెంచ‌డంలో క్రాన్‌బెర్రీస్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి క్రాన్‌బెర్రీస్ ను ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని క్రాన్‌బెర్రీస్ తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఆ పేస్ట్‌లో కొద్దిగా పెరుగు వేసి బాగా క‌లిపి ముఖానికి పూత‌లా వేసుకోవాలి.

ఇర‌వై నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.

చ‌ర్మంపై ముడ‌త‌లు, మ‌చ్చ‌లు పోయి ముఖం కాంతివంతంగా మ‌రియు య‌వ్వ‌నంగా మారుతుంది.

అలాగే మొటిమ‌ల‌తో బాధ ప‌డే వారికి క్రాన్‌బెర్రీస్ అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. క్రాన్‌బెర్రీస్‌ను తీసుకుని పేస్ట్ చేసి అందులో కొద్దిగా తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మంతో ఫేస్ ప్యాక్ వేసుకుని.

పావు గంట లేదా అర గంట పాటు డ్రై అవ్వ‌నిచ్చి అనంత‌రం క్లీన్ చేసుకోవాలి.ఇలా మూడు రోజుల‌కు ఒక సారి చేస్తే మొటిమ‌లు స‌మ‌స్య దూరం అవుతుంది.

ఇక క్రాన్‌బెర్రీస్‌ను మిక్సీలో వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పేస్ట్‌లో కొద్దిగా నిమ్మ ర‌సం వేసి క‌లిపి.ముఖానికి అప్లై చేయాలి.ప‌ది లేదా ఇర‌వై నిమిషాల త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై న‌ల్ల మ‌చ్చ‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.మ‌రియు ముఖం ప్ర‌కాశవంతంగా మారుతుంది.

#Tips #Skin Care #Skin #Benefits

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube