సాధారణంగా అందం విషయంలో అమ్మాయిలు ఏ మాత్రం రాజీపడరు.అందరిలోనూ అందంగా కనిపించేందుకు అనేక ప్రయోగాలు చేస్తుంటారు.
ఇక ఈ చిన్న చర్మ సమస్య వచ్చినా.అస్సల ఒప్పుకోరు.
ఏదో విధంగా ఆ సమస్య నుంచి బయటపడేందుకు ట్రై చేస్తారు.అయితే చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలో, మొటిమలు, మచ్చలు, ముడతలు ఇతరితర సమస్యలు తగ్గించడంలో.
బేకింగ్ సోడా గ్రేట్‌గా సహాపడుతుంది.మరి బేకింగ్ సోడాను చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
వంటల్లో రుచి కోసం ఉపయోగించే బేకింగ్ సోడా.చర్మంపై ఉన్న మృతకణాలను సులువుగా తొలగిస్తుంది.అందుకు బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు చేర్చి.ముఖానికి పట్టించాలి.
పావుగంట తర్వాత చల్లటి నీటితో రుద్దుతూ ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చర్మంపై మృతకణాలు తొలగి.
ముఖం కాంతివంతంగా మారుతుంది.
అలాగే కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని.అందులో కొద్దిగా నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.
పావు గంట తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయి.
మరియు మచ్చలు క్రమంగా చర్మం రంగులో కలిసిపోతాయి.ఇక ఈ ప్యాక్ తర్వాత చర్మం పొడిగా అనిపించినట్లయితే మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
బేకింగ్ సోడాను స్నానం చేసే నీటిలో వేసి.అరగంట తర్వాత బాత్ చేయాలి.ఇలా చేయడం వల్ల బేకింగ్ సోడా శరీరంపై ఉన్న నిర్జీవ కణాలను తొలగించడంలో కీలక పాత్ర వహిస్తుంది.అంతేకాకుండా శరీరం నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది.
ఇక బేకింగ్ సోడాలో కొద్దిగా ఓట్స్ పొడి మరియు నీరు కలిపి ముఖానికి పట్టించాలి.పావు గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకుండే.
బేకింగ్ సోడా చర్మరంధ్రాల్లో ఉన్న మురికిని మరియు ముడతలను తొలగిస్తుంది.ముఖాన్ని కాంతివంతంగా మిలమిల మిరిసేలా చేస్తుంది.