అందంగా ఉన్నారు.. సినిమాల్లోకి రావచ్చుగా.. బిగ్ బీ మనవరాలు సమాధానం ఏంటంటే?

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా.ఇక ఇప్పటి వరకి ఇండస్ట్రీ పరిచయం లేని ఈ ముద్దుగుమ్మ తన తాత తరపున సెలబ్రిటీగా మారింది.

 Beautiful Women Can Run Businesses Too Says Navya Naveli-TeluguStop.com

అంతేకాకుండా తన వ్యక్తిగత విషయంలో కూడా బాగా వార్తల్లో నిలుస్తుంది.బాలీవుడ్ నటుడు కొడుకు మీజాన్ జాఫ్రీ తో ప్రేమలో ఉన్నట్లు వారి మధ్య డేటింగ్ కూడా నడుస్తున్నట్లు పలు రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ బ్యూటీకి అందంగా ఉన్నారు.సినిమాల్లోకి రావచ్చుగా అని ప్రశ్న ఎదురవడంతో తాను ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది.

 Beautiful Women Can Run Businesses Too Says Navya Naveli-అందంగా ఉన్నారు.. సినిమాల్లోకి రావచ్చుగా.. బిగ్ బీ మనవరాలు సమాధానం ఏంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను బాగా పంచుకుంటుంది.సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేత, నిఖిల్ ల కూతురే నవ్య.ఇక ఈమె న్యూయార్క్ లోని ఫోర్డామ్ యూనివర్సిటీలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ‘ ఆరా హెల్త్’ అనే పేరుతో ఆన్ లైన్ లో హెల్త్ కేర్ ను నడిపిస్తుంది.

తాజాగా నవ్య సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో పంచుకుంది.అందులో పింక్ కలర్ డ్రెస్ వేసుకొని అందమైన స్మైల్ ఇస్తూ ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.

ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా తన అభిమానులు లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఓ నెటిజన్ తనను ఓ ప్రశ్న వేశాడు.‘మీరు చాలా అందంగా ఉన్నారు.బాలీవుడ్ లో ప్రయత్నించండి’ అనగా వెంటనే నవ్య.‘మీ అభిమానానికి కృతజ్ఞతలు.కానీ అందమైన మహిళలు వ్యాపారం లోనూ రాణించగలరు’ అని ఆకట్టుకునే విధంగా సమాధానం ఇచ్చింది.

ఇక ఈమె ఇచ్చిన సమాధానానికి పలువురు స్టార్ సెలబ్రెటీలు కూడా తనను ప్రశంసలతో ముంచుతున్నారు.

గతంలో కూడా ఈమెను ఎంతోమంది సినిమాలలో చూడాలని అనుకోగా.తన తల్లి శ్వేత తన కుటుంబం నుంచి మరో వ్యక్తిని రంగంలోకి పంపించాలనే ఉద్దేశం లేదని తెలిపింది.ఎందుకంటే సినిమాలు సరిగ్గా ఆడనప్పుడు తన తండ్రి అమితాబచ్చన్, సోదరుడు అభిషేక్ బచ్చన్ లు ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కొన్నారని అవి తను స్వయంగా చూశానని అందుకే వాటిని జీర్ణించుకోలేకపోవడంతో.

సినీ ఇండస్ట్రీపై తన కూతురిని పరిచయం చేయాలనే ఉద్దేశం లేదని తెలిపింది.

#Viral Pic #AmitabGrand #Women #Social Media #Businesses

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు