సక్కగా పెళ్లి చేసుకో.... అన్నందుకు లైవ్ లో ఫైర్ అయిన శ్రీ ముఖి... 

టాలీవుడ్ బుల్లితెర మీద తన గల గల మాటలతో అందరినీ అలరిస్తూ బుల్లితెర రాములమ్మ గా పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించగా షూటింగులు లేకపోవడంతో ఈ అమ్మడు ఇంటి పట్టునే ఉంటోంది.

 Sree Mukhi, Telugu Beautiful Anchor, Marriage News, Tollywood,anchor Sree Mukhi-TeluguStop.com

ఈ క్రమంలో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.

అయితే ఈ క్రమంలో యాంకర్ శ్రీముఖి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా లైవ్ కార్యక్రమం నిర్వహించి తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

అయితే ఇందులో ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ “చక్కగా పెళ్లి చేసుకో ఇకనైనా” అంటూ కామెంట్ చేశాడు.దీంతో ఈ కామెంట్ కి యాంకర్ శ్రీముఖి తనదైన శైలిలో స్పందిస్తూ “ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే కరోనా పోతాదా.?” అంటూ సమాధానం ఇచ్చింది.దీంతో శ్రీముఖి చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు కొందరు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.

అంతేగాక సినీ సెలబ్రిటీలు కనబడితే చాలు వేరే ఏ విషయాలు లేనట్లు వారిని తమ వ్యక్తిగత విషయం అయిన పెళ్లి గురించి మాత్రమే అడుగుతూ ఇబ్బందులు పెడుతున్నారని ఇది సరికాదని కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ శ్రీముఖి బుల్లితెర మీద పలు రకాల షోలు ఈవెంట్ లకి యాంకరింగ్ నిర్వహిస్తూనే మరోపక్క పలు టాలీవుడ్ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

కాగా గతంలో ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ 3వ సీజన్ లో రన్నరప్ గా నిలిచింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube