దళపతి విజయ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా బీస్ట్.సన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉండగా సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో లేదని అంటున్నారు.ఓ చిన్న పాయింట్ నే నెల్సన్ బీస్ట్ సినిమాగా తీశాడని విజయ్ మార్క్ యాక్షన్.
డైరక్టర్ మార్క్ కామెడీ ఉన్నా సినిమా జస్ట్ విజయ్ ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చేలా ఉందని అంటున్నారు.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బీస్ట్ ఫస్ట్ టాక్ ఆశించిన స్థాఇలో లేదని చెప్పొచ్చు.
బీస్ట్ టాక్ రేపు రిలీజ్ అవుతున్న కె.జి.ఎఫ్ చాప్టర్ 2 కి ప్లస్ గా మారే అవకాశం ఉంది.ఆల్రెడీ భారీ అంచనాలతో వస్తున్న కె.జి.ఎఫ్ చాప్టర్ 2 బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.పాన్ ఇండియా రేంజ్ లో కె.జి.ఎఫ్ చాప్టర్ 2పై సూపర్ క్రేజ్ ఏర్పడింది.బీస్ట్ వర్సెస్ కె.జి.ఎఫ్ చాప్టర్ 2 పోటీలో బీస్ట్ ఫలితం తెలిసింది.బీస్ట్ రిజల్ట్ ఖచ్చితంగా కె.జి.ఎఫ్ చాప్టర్ 2కి కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు.మరి కె.జి.ఎఫ్ 2 ఎలా ఉంటుందో చూడాలి.