ఫుట్ బాల్ ఆడుతున్న ఎలుగుబంట్లు.. నెటిజ‌న్లు ఫిదా

ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాను జంతువులు ఆక్ర‌మించేశాయా అనే అనుమానం క‌లుగుతుంది.ఎందుకంటే ఎక్క‌డ చూసినా వీటి వీడియోలు, లేదంటే ఫొటోల‌కు వ‌చ్చినంత క్రేజ్ మ‌రే వాటికి రావ‌ట్లేదు.

 Bears Playing Football Netizens Fida-TeluguStop.com

ఇక ఈ మ‌ధ్య అయితే జంతువులు కూడా చాలా వ‌ర‌కు మనుషులను చూసి కొన్ని ప‌నులు నేర్చుకుంటున్నాయి.సేమ్ మ‌నుషులు చేసిన‌ట్టే కొన్ని ప‌నులు చేస్తున్నాయి.

ఇక కొన్ని జంతువులు అయితే ఆడే ఆటలు నిజంగానే మ‌న‌ల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి.ఎందుకంటే అవి అచ్చం మ‌నుషులు చేసిన ప‌నులే చేస్తుంటాయి.

 Bears Playing Football Netizens Fida-ఫుట్ బాల్ ఆడుతున్న ఎలుగుబంట్లు.. నెటిజ‌న్లు ఫిదా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మ‌రి ఇలా మ‌నుషుల్లాగే చేసే వీడియోల‌కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.వీటికి సోష‌ల్ మీడియా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుంది.ఇలాంటి జంతువుల‌కు సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో చాలా వ‌ర‌కు చక్కర్లు కొడుతున్నాయి.ఇక ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

అదేంటంటే మ‌నుషుల‌కు ఫుట్ బాల్ ఆడ‌టం తెలుసు.మ‌రి ఈ ఆట‌ల‌ను జంతువులు ఆడితే ఇంకెలా ఉంటుంది చెప్పండి.

అది కూడా క్రూర మృగంగా పేరు తెచ్చుకున్న ఎలుగుబంటి చేస్తే ఇంకెలా ఉంటుంది.

అవును మీరు విన్న‌ది నిజ‌మేనండి.ఇప్పున‌డు మ‌నం చూస్తున్న వీడియోలో రెండు ఎలుగుబంట్లు సేమ్ మనుషుల్లాగే ఫుట్ బాల్ ఆడేస్తూ దుమ్ములేపుతున్నాయి.ఇంకో విష‌యం ఏంటంటే వీటి దగ్గర మనుషులు కూడా ఉండం ఇక వారు కూడా ఈ జంతువుల‌తో ఎంచ‌క్కా ఫుట్ బాల్ ఆడ‌టం మ‌న‌కు క‌నిపిస్తుంది.

బ‌రంగ్‌పూర్ జిల్లాకు చెందిన సుకీగావ్ గ్రామంలో ఇలా రెండు ఎలుగుబంట్లు ఫుట్ బాల్ ఆడుతున్నాయి.కాగా అక్క‌డ మైదానంలోనే యువ‌కులు కొంద‌రు ఫుట్‌బాల్ ఆడుతుండ‌గా అక్క‌డ‌కు స‌డెన్‌గా రెండు ఎలుగుబంట్లు రావ‌డంతో వారు పారిపోయారు.

ఇక ఆ ఎలుగు బంట్లు మాత్రం ఆ బాల్‌తో ఫుట్ బాల్ ఆడ‌టం విశేషం.

.

#Bears #Ball #Football #Football #Animals

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు