సోషల్ మీడియా లో తాజా ఛాలెంజ్ 'బియర్డ్ ట్విట్టర్'  

Beard Challenge In Social Media Goes Viral-

సోషల్ మీడియాలో రోజుకో కొత్త ఛాలెంజ్ తో ప్రముఖులు తమ పాపులారిటీ పెంచుకుంటున్నారు.రోజుకొక నాయా ట్రెండ్ పుట్టుకొస్తుండడం వాటిని ప్రముఖులు సైతం చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచిపోతున్నారు.మొన్నటివరకు బాటిల్ క్యాప్ ఛాలెంజ్ తో సోషల్ మీడియా లో హల్ చల్ చేసిన సినీ రాజకీయ ప్రముఖులు ఆ తరువాత మహిళల కోసం ‘శారీ ట్విట్టర్’ అంటూ ఒక కొత్త ట్రెండ్ వచ్చింది.ఇప్పుడు మళ్లీ పురుషుల కోసం ఈ గడ్డం ఛాలెంజ్ వచ్చి ఇప్పుడు పెద్ద ట్రెండ్ గా మారింది..

Beard Challenge In Social Media Goes Viral--Beard Challenge In Social Media Goes Viral-

గడ్డం ట్విట్టర్ అంటూ పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు తమ ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు.శారీ ట్విట్టర్ ద్వారా ఇప్పటికే పలువురు మహిళా సెలబ్రిటీలు,సామాన్య మహిళలు సైతం చీరలు కట్టుకొని ఫోటోలను తీసుకొని వాటిని సోషల్ మీడియా లో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

వారిలో సుష్మా స్వరాజ్,ప్రియాంక గాంధీ వాద్రా వంటి ప్రముఖులు సైతం ఈ ‘శారీ ట్విట్టర్’ లో ఫోటోలను షేర్ చేశారు.అయితే ఇప్పుడు పురుషులు సైతం మేమేమీ తక్కువ కాదు అంటూ ఈ బియర్డ్ ట్విట్టర్ ని మొదలు పెట్టారు.

ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా గడ్డం తో ఉన్న తమ ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ నయా ట్రెండ్ సృష్టిస్తున్నారు.ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో పాలు పంచుకోగా, ఇంకా ఎంతమంది ఈ ఛాలెంజ్ తో పాపులర్ కానున్నారో చూడాలి.