లాక్ డౌన్ సందర్భంగా గెడ్డం చాలెంజ్! సోషల్ మీడియాలో ట్రెండ్

కరోనా పుణ్యమా అని లాక్ డౌన్ పెట్టడంతో దేశంలో ప్రజలందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు.ఇక సెలబ్రిటీలు, ఉద్యోగులు కూడా ఇంటి వద్దనే కాలక్షేపం చేస్తున్నారు.

 R Madhavan And Jim Carrey Plan To Grow Out Beards, Beard Challenge, Bollywood, H-TeluguStop.com

ఇక సెలూన్ కి వెళ్లి సేవింగ్ చేసుకోవడానికి, హెయిర్ కటింగ్ చేసుకోవడానికి అవి తెరచి లేవు.ఎలాగూ ఇంట్లోనే ఉంటున్నాం కదా అని అందరూ పెరిగిన గడ్డం, జుట్టుతోనే కాలక్షేపం చేస్తున్నారు.

సేవింగ్, కటింగ్ పక్కన పెట్టిన గడ్డాన్ని చూసుకొని ఎంజాయ్ చేస్తున్నారు.రెగ్యులర్ గా నీట్ సేవ్ తో ఆఫీస్ కి వెళ్ళే సాఫ్ట్ వేర్ కుర్రాళ్ళు అయితే వర్క్ ఫ్రం హోం పుణ్యమా అని ఇంటి వద్దనే ఉంటున్నారు.

దీంతో నీట్ సేవ్ పక్కన పెట్టి హ్యాపీగా గెడ్డం లుక్ ని ఎంజాయ్ చేస్తున్నారు.ఈ నేపధ్యంలో దీనిని సోషల్ మీడియాలో ఒక చాలెంజ్ గా మార్చేసి స్నేహితులకి షేర్ చేయడం చేస్తున్నారు.

ఇప్పుడిది విపరీతమైన పాప్యులారిటీ సంపాదించుకుంది.లాక్‌డౌన్‌లో గెడ్డాన్ని అందంగా పెంచుకోవడమే ఈ చాలెంజ్.

బియర్డ్ చాలెంజ్ పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ చాలెంజ్ లో సెలబ్రిటీలు అందరూ పాల్గొంటున్నారు.ఏదో సరదాగ లాక్ డౌన్ కారణంగా వదిలేసిన గెడ్డం లుక్ బాగుండటంతో దీనినే కొనసాగిస్తున్నారు.

ఇది ఒక్క భారత్‌కే పరిమితం కాలేదు హాలీవుడ్ స్టార్లు కూడా ఈ బియర్డ్ చాలెంజ్‌లో పాల్గొంటున్నారు.పాప్యులర్ హాలీవుడ్ స్టార్ అయిన జిమ్ కేరీ, ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించారు.

బాలీవుడ్ నటులు టైగర్ ష్రాఫ్, ఆర్.మాధవన్ వంటి వారు కూడా చాలెంజ్‌‌ను స్వీకరించి తమ ఫొటోలను షేర్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube