కోతుల బెడద తప్పించుకునేందుకు ఆ సర్పంచ్ ఏం చేశాడంటే?

గ్రామాల్లో కోతుల బెడద ఎంత ఎక్కువగా ఉంటుందో అందరికీ తెలిసిందే.కోతుల వల్ల పంటపొలాలు నాశనం అయిన దాఖలాలు కూడా ఉన్నాయి.

 Bear Shaped Man Wandering To Make Monkeys Run-TeluguStop.com

కోతులను వెళ్లగొట్టేందుకు గ్రామస్థులు పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు.కాగా వారు కోతుల బెదడ నుండి మాత్రం ఉపశమనం పొందలేకపోతున్నారు.

అవి అడవులకు వెళ్లినట్లు వెళ్లి మళ్లీ గ్రామాలపై తమ ప్రతాపం చూపుతున్నాయి.దీంతో ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామ సర్పంచ్ వినూత్న ఏర్పాటు చేశాడు.

ఖమ్మం జిల్లా కొణిజర్ల సర్పంచ్ సూరంపల్లి రామారావు కోతుల బెడద తప్పించేందుకు ఎలుగుబంటి వేషంలో ఓ మనిషిని నియమించాడు.అతడు గ్రామంలో తిరుగుతూ కోతులను భయానికి గురిచేస్తున్నాడు.

ఎలుగుబంటి అనుకుని కోతులు అతడిని చూడగానే పారిపోతున్నాయి.సర్పంచ్ తెలివికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఎలుగుబంటి ఆకారంలో ఉన్న వ్యక్తితో గ్రామంలోని పిల్లలు ఫోటోలు దిగుతూ సరదా పడుతున్నారు.

Telugu Bear Shaped, Khammam, Monkeys, Weird-

ప్రతి గ్రామంలోనూ ఇలాంటి వినూత్న ఆలోచన ఆచరిస్తే కోతుల బెడద తప్పుతుందని ఇతర గ్రామాల ప్రజలు అంటోన్నారు.కోతులు కొండముచ్చులకు సైతం భయపడకుండా గ్రామాల్లోనే తిరుగుతూ ఉండటంతో వాటి నుండి తమను కాపాడలంటూ ప్రజలు ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube