ఎలుగుబంటి స్టెప్పులకు నెటిజన్లు ఫిదా.. మంచువానలో అదరగొట్టిందిగా..!

ఈ మధ్యకాలంలో జంతువుల వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వాటిలో కొన్ని నవ్వును తెప్పిస్తుంటే ఇంకొన్ని బాధను కలిగిస్తున్నాయి.

 Bear Dance Mesmerises Netizens In Snow Rain, Beer Dance, Latest News, Viral Late-TeluguStop.com

తాజాగా ఓ ఎలుగు బంటి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.సాధారణంగా ఎలుగు బంటి పేరు వింటే చాలా మంది ఉలిక్కి పడతారు.

ఈ ఎలుగు బంట్లు కొండ ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి.పల్లెటూర్లలో కనిపించాయంటే చాలు జనాలు పరుగులు తీయాల్సిందే.

అప్పట్లో పండగలకు ఎలుగుబంటిని పల్లెటూర్లలో తిప్పేవారు.అది ఇచ్చే తాయత్తును కట్టుకోవడానికి చాలా మంది క్యూ కట్టేవారు.

రాను రాను జంతు ప్రేమికుల వల్ల ఆ విధానం మారిపోయింది.ఇప్పుడు అడవి జంతువులను పెంచుకోకూడదు.

ఒక వేళ పెంచుకున్నా జనసంచారంలోకి తీసుకుని రాకూడదు.కొండల్లో ఎక్కువగా ఉండే ఈ ఎలుగుబంట్లు ఆ కొండలు తరిగిపోతుండటంతో పంటపొలల మీద పడుతున్నాయి.

పంటలను పాడు చేస్తున్నాయి.దీని వల్ల రైతులకు నష్టాలు కూడా వస్తున్నాయి.

సాధారణంగా ఎలుగుబంట్లు రాత్రివేళ రెచ్చిపోతాయి.

పగటి పూట ఎలుగుబంట్లు బయటకు రాలేవు.

అలా వచ్చాయంటే అవి మనుషులకు కూడా భయపడిపోతాయి.వాటి బలమంతా కూడా రాత్రి సమయంలోనే ఉంటుందని పెద్దలు చెబుతుంటారు.

ప్రతి జీవికి ఆకలి ఉన్నట్లు ఈ ఎలుగు బంట్లుకు కూడా ఆకలి అనేది విపరీతంగా ఉంటుంది.వాటిని ఆనందం వస్తే ఆనందపడతాయి.

సంతోషం వస్తే కేరింతలు కొడతాయి.తాజాగా అలా భావోద్వేగంతో చిందులు వేసిన ఓ ఎలుగు బంటి వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

అమెరికాలో మంచు వర్షం కురవడం మామూలే.మంచు వర్షంలో కొండ ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లమధ్యకి ఎలుగుబంటి వెళ్లింది.దానితో పాటుగా దాని పిల్ల కూడా వెళ్లింది.ఆ సమయంలో మంచువానలో ఎలుగుబంటి దాని పిల్ల ఇద్దరూ ఆటలాడుకున్నాయి.ప్రస్తుతం వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వీటిని చూసి నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube