ఆ విషయంలో హర్ట్ అయి...ఇక దానికి ససేమిరా అంటోన్న రకుల్

నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇటు తెలుగు,ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది.కరోనా కారణంగా షూటింగ్ లు జరగకపోవడంతో రకుల్ సినిమాలు ఏవీ విడుదలకు నోచుకోలేదు.

 Be Hurt In That Case And Sasemira Antonna Rakul For It-TeluguStop.com

అయితే కరోనా నుండి కోలుకొని థియేటర్స్ కూడా మెల్లగా తెరుచుకుంటున్న పరిస్థితులలో నితిన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించిన సినిమా చెక్.తాజాగా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న చెక్ సినిమాలో రకుల్ పాత్ర కు సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

షూటింగ్ లో జరిపినంత భాగం మొత్తం సినిమాలో లేదని, ప్రాధాన్యత గల పాత్ర లేకపోవడం, కొంత నిడివిగల పాత్ర అయినా ప్రియా వారియర్ పాత్రకు మంచి స్పందన వస్తుండడంతో హర్ట్ అయి సినిమా ప్రమోషన్లకు కూడా హాజరవడం లేదట.అయితే సినిమా విడుదల తరువాత ప్రియా వారియర్ పాత్ర కే మంచి స్పందన వస్తుండడంతో ఇక సినిమా ప్రమోషన్లలో ప్రియా మాత్రమే పాల్గొంటున్నదని, ఒక్క ట్విట్టర్ లో సినిమా విడుదల కు సంబంధించి పోస్ట్ చేయడం తప్ప మిగతా కార్యక్రమాలకు దీనికి హాజరు కావడం లేదట.

 Be Hurt In That Case And Sasemira Antonna Rakul For It-ఆ విషయంలో హర్ట్ అయి…ఇక దానికి ససేమిరా అంటోన్న రకుల్-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విషయాన్ని బయటికి మూవీ టీం చెప్పకపోయిన ప్రమోషన్స్ కు హాజరుకాకపోవడం వెనుక అసలు కథ ఇదేనని చర్చించుకుంటున్నారు.

#@Rakulpreet #CheckMovie #LatestTollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు