పేటీఎం స్క్రాచ్‌ కార్డు అంటూ నయా మోసం.. జర జాగ్రత్త సుమీ..!

ఇటీవల పేటీఎం పేరుతో ఆన్ లైన్ స్కామ్స్ జరుగుతున్నాయి.దీంతో చాలా మంది అమాయకులు మోసపోతున్నారు.

 Be Careful With The Paytm Scratch Card Fraud , Paytm , Scrach Crads, Cheating ,-TeluguStop.com

డబ్బులు పోగొట్టుకుంటున్నారు.కరోనా వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.

దీంతో బయటకు వెళ్లకుండా ఇంటి నుంచే ఆన్ లైన్ లావాదేవీలను చేపడుతున్నారు.ఇటువంటి తరుణంలో అనేక మోసాలు ఆన్ లైన్ వేదికగా జరుగుతున్నాయి.

ప్రస్తుతం పేటీఎం క్యాష్‌బ్యాక్‌ స్కాంతో భారీగా మోసపోతున్నారు.ఈ స్కాంలో మీరు గూగుల్‌ క్రోమ్‌ నోటిఫికేషన్‌ వస్తుంది.

అందులో ‘కంగ్రాట్స్‌! మీరు పేటీఎం స్క్రాచ్‌ కార్డుకు రాండంమ్‌గా సెలెక్ట్‌ అయ్యారు’ అని వస్తుంది.పేటీఎం పై ఉన్న నమ్మకంతో చాలా మంది రెండో ఆలోచన చేయరు.

లింక్‌ ఓపెన్‌ చేసేస్తారు.దీంతో పేటీఎం క్యాష్‌ ఆఫర్‌ డాట్‌ కమ్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది.అప్పుడు మీరు రూ.2,647 క్యాష్‌బ్యాక్‌ పొందారని, వెంటనే ఆ రివార్డును పేటీఎం ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకొమ్మని ఉంటుంది.ఆ ఫేక్‌ వెబ్‌సైట్‌ కూడా అధికారిక పేటీఎం యాప్‌ మాదిరిగానే ఉంటుంది.ఒకసారి మీరు సెండ్‌ బటన్‌ నొక్కితే, మీ ఒరిజినల్‌ పేటీఎం యాప్‌ ఓపెన్‌ అవుతుంది.

అక్కడ ‘పే ది సేమ్‌ అమౌంట్‌’ అని ఉంటుంది.కానీ, చాలా మంది అది ‘పే’ బటన్‌ అని గుర్తుకు తెచ్చుకోరు.

వారు ట్యాప్‌ చేసేస్తారు.దీంతో డబ్బులు వారికి క్రెడిట్‌ అయిపోతాయి.

Telugu Cyber, Latest, Pay, Pay Amount, Paytm, Paytm Fraud, Paytmscratch, Paytmwa

ఒకవేళ మీ వద్ద పేటీఎం యాప్‌ ఇన్‌స్టాల్‌ అయి ఉండకపోతే ఈ మోసం బారిన పడే ఛాన్స్‌ ఉండదు.ఒక విషయం గుర్తుంచుకోండి పేటీఎం ఇతర ప్లాట్‌ఫాంల ఆధారంగా ఇటువంటి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను ప్రకటించదు.కేవలం పేటీఎం ఒరిజినల్‌ పేటీఎం యాప్‌లోనే ఆఫర్లను ఇస్తుంది.డైరెక్టగా మీ పేటీఎం ఖాతాలో లేదా వ్యాలెట్‌లో జమా అయిపోతుంది.ఇతర ప్లాట్‌ఫాంల నుంచి క్యాష్‌బ్యాక్‌ను కలెక్ట్‌ చేసుకొమ్మని అడగదు.గత 15 నెలలుగా దాదాపు 25 శాతం బీ2సీ స్కాంలను కేవైసీ ద్వారా గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube