జాగ్రత్త.. కరోనా వ్యాక్సిన్ అంటూ రిజిస్ట్రేషన్ ఫోన్ వస్తోందా..?!

కరోనా వ్యాక్సిన్ ని ఈ సంవత్సరంలోనే విడుదల చేయాలని పలు ప్రముఖ సంస్థలు రెడీ అవుతున్నాయి.అయితే అనేక దేశాల ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్ ని తమ ప్రజలకు పంపిణీ చేసేందుకు అనేక కసరత్తులు చేస్తున్నాయి.

 Carona Virus, Vaccine, Registration,9490617310 , 100, Whats Up App, Trap, Police-TeluguStop.com

కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం కూడా ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక సూచనలు చేస్తోంది.అయితే ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వ్యాక్సిన్ పొందేందుకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా వాదనలు వినిపించాయి.

అయితే అవి నిజమేనని కొందరు భావిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.కరోనా వ్యాక్సిన్ కావాలనుకున్నవారు త్వరగా తమ ఆధార్ కార్డు, బ్యాంకు డీటెయిల్స్, ఫోన్ నెంబరు కు వచ్చే ఓటీపీ ఇవ్వాలని సైబర్ నేరగాళ్లు అడుగుతున్నారు.

అయితే తాము మోసపోతున్నమన్న విషయం గ్రహించలేని కొందరు అమాయకులు సైబర్ నేరగాళ్లు అడిగిన సమాచారం అంతా సమర్పిస్తున్నారు.దీంతో క్షణాల్లోనే వారి బ్యాంకు నుంచి డబ్బులు మొత్తం చోరిచేయబడుతున్నాయి.

తెలివి మీరిన దొంగలు ఎప్పటి నుంచో అమాయక ప్రజల నుంచి డబ్బులను కాజేస్తున్నారు.బ్యాంకు డీటెయిల్స్ ఎవ్వరికి ఇవ్వకూడదు అని ఎన్నిసార్లు చెప్పినా కొందరు మాత్రం నిర్లక్ష్యం వహించి తమకు సంబంధించిన సమాచారం మొత్తం అపరిచితులకు ఇచ్చి మోసపోతున్నారు.

Telugu Aadhaar, Bank, Carona, Storages, Corona Epidemic, Corona Vaccine, Cyber C

అయితే ఈ కరోనా వ్యాక్సిన్ ట్రాప్ లో పడి నష్టపోయిన బాధితులు పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించగా.పోలీసులు మిగిలిన ప్రజలందరిని అప్రమత్తం కావాలని కోరారు.సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ ఎవరైనా ఫోన్ చేసి కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెబితే అది మోసమని గ్రహించాలని.అనుమానం ఉంటే 100 కి డయల్ చేసి కంప్లైంట్ ఇవ్వాలని ఆయన అన్నారు.

సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444 లేదా సైబరాబాద్ సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ సెల్ 9490617310 నంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని వీసీ సజ్జనార్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube