వాట్సాప్ పే చేస్తున్నారా ..? అయితే ఇవి గమనించండి..!

భారతదేశంలో మరోసారి వాట్సాప్ తన వాట్సాప్ పే సర్వీసులను తిరిగి ప్రారంభించింది.ఇక నుంచి భారతదేశంలో వాట్సాప్ నుండి వాట్సాప్ యూపీఐ పేమెంట్ లు జరుగుతాయి.

 Be Careful About Customer Care Number In Whatsapp Pay, Whatsapp Pay, Payments, S-TeluguStop.com

యూపీఐ విధానం ద్వారా ఆర్థిక లావాదేవీలు వాట్సాప్ ద్వారా కొనసాగనున్నాయి.ఇది కూడా మిగతా యూపీఐ యాప్స్ లాగే పనిచేస్తుంది.

ఇకపోతే ఎవరైతే వాట్సాప్ పే చేసే సమయంలో వారు ఎలాంటి విషయాలను గుర్తుంచుకోవాలో తెలుసుకోండి.

ఇందులో ముఖ్యంగా వాట్సాప్ మీ బ్యాంకు సంబంధించిన వివరాలను ఎక్కడా కూడా అడగదు.

మీ వివరాలు కోరుతూ కాల్స్ లేదా ఏదైనా మెసేజ్ లు వస్తే మాత్రం మీరు వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి.ఇక అలాగే వాట్సాప్ పేమెంట్ సర్వీస్ కు సంబంధించి ఎలాంటి కస్టమర్ కేర్ నెంబర్ ను ఫేస్బుక్ మెయింటైన్ చేయట్లేదు.

ఒకవేళ ఎవరైనా సరే తొందరగా గూగుల్ లో వాట్సాప్ పేమెంట్ కస్టమర్ కేర్ అని సెర్చ్ చేసి ఆ నెంబర్ కు కాల్ చేసి మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ చేసుకోవద్దు.అలాగే ఎవరైనా సరే వాట్సాప్ పేమెంట్ సర్వీస్ నుంచి కాల్ చేస్తున్నాం అంటే వెంటనే ఆ కాల్ ను నిలిపి వేయడం ఎంతో శ్రేయస్కరం.

Telugu Carefulcare, Care Number, Server, Whatsapp Pay, Whatsup Pay-Latest News -

ఆ తర్వాత పే బటన్ ట్యాప్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ ఖాతా నుండి డబ్బు కట్ అయిపోవడమే కాకుండా ఇలాంటి సమయంలో మీకు వాట్సాప్ పేమెంట్ రిక్వెస్ట్ వస్తే గనక మీరు చేసే ముందు ఒకటికి రెండుసార్లు మీరు డబ్బులు ఎవరికి పంపిస్తున్నారు చెక్ చేసి పంపించండి.అలాగే వాట్సాప్ పేకు సంబంధించి మీ కార్డ్ వివరాలు అలాగే ఓటిపి లేదా యూపీఐ వంటి వివరాలను షేర్ చేయకుండా జాగ్రత్త వహించాలి.ముఖ్యంగా వాట్సప్ పే అంటూ వచ్చే మెసేజ్ లను క్లిక్ చేయకుండా జాగ్రత్త వహిస్తే మీ డబ్బులు సేఫ్ గా ఉంటాయి.లేకపోతే సైబర్ నేరస్తులు డబ్బులు కొట్టేయడానికి ఆస్కారం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube